క్రీడాభూమి
బార్బోడస్పై పరాజయం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బ్రిడ్జిటౌన్, సెప్టెంబర్ 23: బ్రాండన్ కింగ్ అర్ధ సెంచరీతో బార్బోడస్పై గయానా అమెజన్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. కరేబియన్ లీగ్లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్లో గయానా అమెజాన్ వారియర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బార్బోడస్ ట్రైడెంట్స్ బ్యాట్స్మెన్లలో జీన్ పాల్ డుమిని (38), అలెక్స్ హేల్స్ (24) మినహా మరెవ్వరూ ఆకట్టులేకపోవడంతో 19.2 ఓవర్లలోనే 138 పరుగులకు కుప్పకూలింది. గయానా అమెజాన్ బౌలర్లలో క్రిస్ గ్రీన్ 4 వికెట్లు తీయగా, ఇమ్రాన్ తాహీర్ 2, కీమో పాల్, రోమర్లో షెపర్డ్, షోయాబ్ మాలిక్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన గయానా అమెజాన్ డక్వర్త్ లూయస్ పద్ధతిలో 11 ఓవర్లలోనే 2 వికెట్లను కోల్పోయ విజయం సాధించింది. ఓపెనర్లు బ్రెండన్ కింగ్ (51, నాటౌట్), చంద్రపాల్ హేమ్రాజ్ (20) రాణించారు.