కృష్ణ

కనీస పెట్టుబడులతో గో ఆధారిత సేంద్రీయ వ్యవసాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వ్యవసాయదారుల సమావేశంలో విహెచ్‌పి అంతర్జాతీయ అధ్యక్షులు ప్రవీణ్‌భాయి తొగాడియా
విజయవాడ, డిసెంబర్ 3: కనీస పెట్టుబడులతో గో ఆధారిత సేంద్రీయ వ్యవసాయం చేపట్టాల్సిందిగా విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు డా.ప్రవీణ్‌భాయి తొగాడియా పిలుపునిచ్చారు. సత్యనారాయణపురంలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో జరిగిన వ్యవసాయదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పెట్టుబడి లేని గో అధారిత వ్యవసాయం ఎందుకు చేయాలో, ఎలా చేయాలో శాస్ర్తియ నిరూపణలతో రైతులకు శిక్షణ రూపంలో తెలియజేశారు. తాను 25వ ఏట వరకు ప్రత్యక్షంగా వ్యవసాయం చేశానని, ఆ తరువాత అనేకమంది వ్యవసాయ శాస్తజ్ఞ్రులను కలిసి వ్యవసాయ పద్ధతులు, ఎరువుల వాడకం గురించి వ్యవసాయ దిగుబడుల గురించి పూర్తి పరిజ్ఞానం సంపాదించానన్నారు. ఇప్పటికి కూడా ఖాళీ సమయాల్లో తాను తమ వ్యవసాయ క్షేత్రంలో కుటుంబ సభ్యుల సహకారంతో గో ఆధారిత సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నానన్నారు. 1960 నుంచి దేశంలో రసాయన ఎరువుల వాడకాన్ని మొదలుపెట్టామన్నారు. ఏ మొక్కైనా పెరుగుదలకు 26 రకాల రసాయనిక పదార్ధాలు కావాలన్నారు. వీటిలో నైట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, కాపర్ మొదలగునవి ఉన్నాయన్నారు. అయితే నేలలో భౌతిక ఆరోగ్యం, రసాయనిక ఆరోగ్యం, జీవరసాయన ఆరోగ్యం ఉండాలని తొగాడియా తెలిపారు. ఈ 26 రసాయనాల్లో ఏ ఒక్కటి తగ్గినా అది ఆరోగ్యమైన నేల అనిపించబడదన్నారు. జీవ రసాయన ఆరోగ్యం విషయంలో 1960 వరకు ఒక గ్రాములో 10కోట్ల జీవ రసాయనాలు ఉండేవన్నారు. రసాయన ఎరువుల వాడటం మూలంగా ఈ జీవ రసాయనాలు క్రమేపీ నశించిపోయాయన్నారు. అందుకే భూమి సారవంతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. మొక్కకు నైట్రోజన్, పాస్ఫరస్, పొటాషియం, కార్బన్‌డైయాక్సైడ్, నీరు కావాలన్నారు. ఇందులో కార్బన్‌డైయాక్సైడ్, నీరు ప్రకృతి సిద్ధంగా వస్తాయన్నారు. మిగిలిన మూడింటిని మన ప్రక్రియ ద్వారా అందజేయాల్సి ఉందన్నారు. ఈ మూడు రసాయనాల ద్వారా రైజోబియం, ఆదోబాక్టర్, అసోటోబాక్టర్, గ్రీన్ ఆల్గే అనబడే బాక్టీరియా తయారుచేసి భూమి సారవంతం చేస్తాయన్నారు. అందుకే గో ఆధారిత పదార్ధాల ద్వారా జీవామృతం తయారుచేసే విధానం, వానపాములను పొలంలో వెదజల్లడం, జీవకణ ఎరువులు, పంచకవ్య ఎరువులు, హోమ ఆధారిత గ్రహ నక్షత్ర ఆధారంగాను, బయోడైనమిక్ పార్మింగ్, నాందేడ్, బెంగుళూరు పద్ధతిలోను, శాస్ర్తియ పద్ధతుల్లోను వ్యవసాయం చేసి అతి తక్కువ పెట్టుబడులతో భూమిని సారవంతం చేసుకుంటూ అధిక దిగుబడులు ద్విగుణీకృత ఆదాయాన్ని పొందవచ్చన్నారు. ఈ సందర్భంగా ఈ పద్ధతులన్నింటిపై తొగాడియా ఎంతో ఓర్పుగా ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
గో ఆధారిత వ్యవసాయదారుల సంఘ అధ్యక్షులు భూపతిరాజు రామకృష్ణంరాజు మాట్లాడుతూ స్వయంగా వ్యవసాయం చేసి ఎకరాకు 30వేలు ఆర్జిస్తున్నారని చెప్పారు. ఆంధ్రా ఛాంబర్ అధ్యక్షులు ముత్తవరపు మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విహెచ్‌పి ప్రాంత ఉపాధ్యక్షులు పివిఎస్ నాయుడు, కందర్ప వాసు, బెంగుళూరు క్షేత్ర గోరక్షా ప్రముఖ్ యాదగిరిరావు, క్షేత్ర సేవా ప్రముఖ్ ఎం.హనుమంతరావు, ప్రాంత కార్యాదక్షులు వబిలిశెట్టి వెంకటేశ్వర్లు, గో ఆధారిత వ్యవసాయ ప్రాంత కార్యదర్శి పి.రామ్మోహన్‌రెడ్డి, ఆంధ్ర ప్రాంత ప్రచార ప్రముఖ్ ఎవి రామారావు, పెద్ద సంఖ్యలో గో ఆధారిత వ్యవసాయం చేసే రైతులు పాల్గొన్నారు.