అంతర్జాతీయం

కుదిరిన ఒప్పందాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొరోనీ (కామొరోస్), అక్టోబర్ 11: రక్షణ రంగంలో సహకారంసహా భారత్, కామొరోస్ దేశాల మధ్య మొత్తం ఆరు అంశాలపై ఒప్పందాలు కుదిరాయి. కామొరోస్‌లో పర్యటిస్తున్న భారత ఉపరాష్టప్రతి ఎం. వెంకయ్య నాయుడు జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా కామొరోస్ అధ్యక్షుడు అజలి అసౌమనితో ఉపరాష్టప్రతి సుధీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం ఆరు అంశాలపై అవగాహన కుదిరింది. వీటిలో రక్షణ సంబంధమైన సహకారం కూడా ఉంది. వెంకయ్య నాయుడు, అసౌమని సమక్షంలో ఇరు దేశాలకు చెందిన ఉన్నతాధికారులు ఒప్పందం పత్రాలపై సంతాలు చేశారు. భారత్‌తో మైత్రీ సంబంధాలకు గుర్తుగా ఉపరాష్టప్రతికి అసౌమని ఒక జ్ఞాపికను బహూకరించారు. రక్షణ, ఆరోగ్యం, పునరుద్పాతక ఇంధన వనరులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్థికాభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం రంగాల్లో కలసికట్టుగా ముందుకు వెళ్లాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. అదే విధంగా పర్యాటకులను వీసా లేకుండానే అనుమతించేందుకు ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి.