క్రీడాభూమి

చిక్కుల్లో షకీబ్ అల్ హసన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, అక్టోబర్ 26: బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ చిక్కుల్లో పడ్డా డు. ఓ టెలికాం కంపెనీతో స్పాన్పర్‌షిప్ డీల్ కుదుర్చుకున్న షకీబుల్ బోర్డుతో కాంట్రాక్టు నిబంధనలు ఉల్లంఘించడం టూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఆరోపించింది. బంగ్లా జట్టును గతంలో స్పాన్సర్ చేసిన గ్రామీఫోన్ సంస్థతో మం గళవారం షకీబుల్ అగ్రిమెంట్ కుదుర్చు కున్నాడు. ఆ సమయంలో షకీబ్ జట్టు స భ్యుల సమ్మెకు నేతృత్వం వహించాడు. బోర్డుతో కుదుర్చుకున్న ఒప్పందం విష యంలో విధానపరమైన ఉల్లంఘనలకు పాల్పడ్డాడని, అతడిపై చట్టపరమైన చర్య లు తప్పవని బీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ నిజాముద్దీన్ చౌదరి హెచ్చరించా డు. షకీబ్, గ్రామీఫోన్ సంస్థ నుంచి పరిహారం కోరుతామని బీసీబీ అధ్యక్షుడు నజ్మూల్ హసన్ అన్నాడు. ‘ఈ విషయం లో చట్టపరమైన చర్యలు తీసుకోక తప్ప దు. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కంపె నీతో పాటు షకీబ్ నుంచి కూడా పరి హారం వసూలు చేస్తాం’ అని హసన్ పే ర్కొన్నాడు. 2009-11 మధ్య గ్రామీఫోన్ బంగ్లాదేశ్ జాతీయ జట్టుకు స్పాన్సర్‌గా వ్యవహరించింది. 2015లో బిడ్డింగ్ ద్వార జట్టుకు స్పాన్సర్‌గా వ్యవహరించాల్సిన గ్రామీఫోన్ ఆటగాళ్లతో వ్యక్తిగతంగా ఒప్పందం కుదుర్చుకుందని, దీంతో బో ర్డుకు పెద్దమొత్తంలో నష్టం వాటిల్లిందని హసన్ వివరించాడు. ఆ తర్వాత ఆటగాళ్లే వరూ టెలికాం కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోరాదంటూ అగ్రిమెంట్ చేసుకు న్నామని, ఇప్పుడా అగ్రిమెంట్‌ను షకీబ్ ఉల్లంఘించడాని పేర్కొన్నాడు. సమ్మె చేస్తూనే షకీబ్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నా డని, ఇది పొగరుబోతు చర్య అని మం డిపడ్డాడు. అలాగే మైదానంలోనూ షకీబ్ ప్రవర్తన బాగుండడం లేదంటూ విమర్శిం చాడు. ఇటీవల ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో షకీబ్ అత్యధిక పరుగులు సాధించి, టాప్-3లో నిలిచిన విషయం తెలిసిందే.
నెట్ ప్రాక్టీస్‌లో కనిపించని షకీబ్..
మరోవైపు టీమిండియాతో టీ20, టెస్టు సిరీస్ సందర్భంగా బంగ్లా ఆటగా ళ్లంతా మిర్పూర్‌లోని షేర్ బంగ్లా జాతీ య క్రికెట్ మైదానంలో ప్రాక్టీస్ చేశారు. అయితే నెట్ ప్రాక్టీస్‌కు షకీబ్ అల్ హసన్ హాజరు కాలేదు. అయతే ఇటీవల జరిగిన సమ్మెకు షకీబ్ నేతృత్వం వహించడంతోనే బోర్డు ఇలా ఇబ్బందులకు గురిచేస్తుం దనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.

*చిత్రం... బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్