తెలంగాణ

ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయొద్ద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 13: కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా, 38 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న సీఎం కేసీఆర్ ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరిస్తే ఉద్యమిస్తామని కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది. బుధవారం ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీకి సంబంధించిన సమాచారాన్ని శాసనసభలో ఒక విధంగాను, న్యాయస్థానంలో మరొక విధంగా అందించి రాజ్యాంగాన్ని అవమానపరిచినట్లుగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన సీఎంకు బహిరంగ లేఖ రాశారు. రవాణా సౌకర్యాలు లేకపోవటంతో సామాన్య ప్రజానీకం ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. గత రెండు నెలల నుండి జీతాలు అందక సుమారు 50 వేల మంది ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమన్నారు. అతి ముఖ్యమైన దసరా, దీపావళి పండగ సంబరాల్లో కార్మికుల కుటుంబాలు పాలుపంచుకోలేక బాధపడ విషయాన్ని కూడా ఇక్కడ గమనంలోకి తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వాలు సరళమైన ధరలతో ఆర్టీసీ ద్వారా ప్రజలకు రవాణా సదుపాయాన్ని తీసుకురావడానికి కృషి చేశాయన్నారు. రాజరిక వ్యవస్థలో ఉన్నటు వంటి నిజాం ప్రభుత్వం 1932 సంవత్సరంలో నిజా స్టేట్ రైల్ అండ్ రోడ్ ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంట్ ప్రభుత్వ శాఖ ద్వారా ప్రజలకు సరళమైన ధరలకు రవాణా సదుపాయాలనుఅందుబాటులోకి తెచ్చిందన్నారు. 1958లో ఏపీఎస్ ఆర్టీసీ అవతరించిందన్నారు. ఆ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 1963లో రాష్ట్రంలో అన్ని రూట్లను జాతీయకరణ చేసి ప్రజల కోసం అతి పెద్ద సంస్థగా ఆర్టీసీని మార్చిందన్నారు. ప్రజల ఆస్తిగా ఉన్న ఆర్టీసీ సంస్థలను నేడు ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడం అత్యంత ప్రమాదకరమన్నారు. దాదాపు 10వేలకు పైగా బస్సులను కలిగి ఉన్న ఆర్టీసీలో 5100 బస్సులు తిరిగే రూట్లను ప్రైవేటీకరణ చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటన చేసిందన్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని ఆ రూట్లను యదాతథంగా ఆర్టీసీనే కొనసాగించాలన్నారు.