తెలంగాణ

మద్దతు ధర అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 13: ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన పంటలు మార్కెట్‌కు వస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. బుధవారం నాడిక్కడ చెరుపల్లి సీతారాములు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పత్తి, మొక్కజొన్న , వరి , మిర్చి పంటలు మార్కెట్‌కు రావడం మొదలైందని, అనేక మార్కెట్లలో కనీస మద్దతు ధరలు అమలుకావడం లేదని అన్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీసుకొచ్చిన పత్తిని అధికారులు కొనుగోలు చేయడం లేదని అన్నారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్‌కు మంగళవారం వరకూ దాదాపు 3 లక్షల క్వింటాళ్లు వస్తే సీసీఐ కేవలం 400 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసిందని అన్నారు. కనీస మద్దతు ధర క్వింటాల్‌కు 5500 రూపాయిలు ఉండగా, అనేక మార్కెట్లలో 2300 నుండి 3500 రూపాయిలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని ఆయన చెప్పారు. అత్యధికంగా 4900 రూపాయిలకు కొన్నారని, దీనివల్ల రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా పత్తి సాగు చేసిన రైతులే ఉన్నారని, మార్కెటింగ్ శాఖ జోక్యం చేసుకుని కనీస మద్దతు ధరలు అమలు అయ్యేలా చూడాలని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చేస్తున్న అనేక మార్కెట్లలో కనసీ మద్దతు ధర క్వింటాలుకు 1815 రూపాయిలు అమలుచేయాల్సి ఉండగా, కేవలం 1500 నుండి 1600 రూపాయిలకు మాత్రమే కొంటున్నారని, ప్రైవేటు మార్కెట్ దారులు, రైస్ మిల్లర్ల మద్దతు ధరలు అమలుచేయడం లేదని , మార్క్‌ఫెడ్, ఐకేపీ కేంద్రాల్లో కూడా రైతులకు తూకాల్లో మోసాలు జరుగుతున్నాయని వీటిని అరికట్టాలని అన్నారు. ఖరీఫ్ సీజన్ ముగిసి రబీ సీజన్ ప్రారంభమైందని, దాదాపు 30 శాతం మంది రైతులకు ఖరీఫ్ సీజన్‌లో రైతుబంధు పథకం అమలు కాలేదని, అదే విధంగా దాదాపు 9 లక్షల మందికి పట్టాదారు పాస్‌పుస్తకాలు అందలేదని, ఫలితంగా వారికి రైతుబంధు లేదా ప్రభుత్వ బ్యాంకుల్లో రుణసౌకర్యం లభించలేదని అన్నారు. వీరికి తక్షణం పట్టా పాస్‌పుస్తకాలు ఇవ్వాలని, అదే విధంగా ప్రభుత్వ హామీ మేరకు లక్ష రూపాయిల లోపు రుణాలను మాఫీ చేసి రైతుల ఖాతాల్లో జమ చేయాలని కోరుతూ సీపీఐఎం రాష్ట్ర కమిటీ తీర్మానించినట్టు ఆయన చెప్పారు.