తెలంగాణ

ఆర్టీసీ దీక్షలు భగ్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 16: ఆర్టీసీ జేఏసీ కన్వీనర్లు శనివారం చేపట్టిన నిరవదిక నిరాహార దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. హైదరాబాద్‌లో కార్మికుల కదలికలపై పోలీస్ నిఘా, పహారా మధ్య భద్రతా ఏర్పాట్లు కొనసాగాయి. జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్‌రోకోలు తీవ్ర ఉద్రిక్తితలకు దారితీశాయి. బస్‌రోకోలు చేపట్టడానికి కార్మికులు శనివారం తెల్లవారుజామున బస్టాండ్‌ల వద్దకు చేరుకున్నారు. ఉదయం నుంచే, వాహనాలు బయటికి రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని బలవంతంగా నెట్టివేశారు. దీంతో పోలీసులకు, కార్మికులకు మధ్య తోపులాటలు జరిగాయి. ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో రాష్ట్ర వ్యాప్తంగా పలు బస్టాండ్లు దద్దరిల్లాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని జేఏసీ నేతలు ఆరోపించారు. పరిస్థితులను అదుపులో ఉంచేందుకు హైదరాబాద్‌లో యూనియన్ కార్యాలయాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. శనివారం ఉదయం అశ్వత్థామరెడ్డి హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్ వద్దకు రావడానికి ప్రయత్నించారు. అయితే, అందుకు అనుమతిలేదని తెలియడంతో ఆయన ఇంటి వద్దనే దీక్ష చేపట్టారు. దీక్షకు మద్దతుగా భారీగా కార్మికులు అశ్వత్థామరెడ్డి ఇంటికి చేరుకుని దీక్షకు సంఘీభావం తెలిపారు. సాయంత్రం అశ్వత్థామరెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేసి, అదుపులోకి తీసుకున్నారు. కార్మికులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చేసుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముందుగా ప్రకటించినట్లుగా జెఏసీ నేతలు ఇందిరాపార్క్ వద్ద నిరవధిక నిరాహార దీక్షలకు ఉద్యమించారు. అయితే, జెఏసీ కో-కన్వీనర్ రాజిరెడ్డిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి, పహడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌కు తరిలించారు. ఇందిరాపార్క్ వద్ద నిరశనకు ప్రయత్నించిన కార్మికులను చెదరగొట్టారు. ఇలావుంటే, ఆర్టీసీ జెఏసీ నేతల దీక్షలను పరామర్శించడానికి వచ్చిన కేరళ సీపీఐ ఎంపీ వినయ్ బిశ్వం రాజిరెడ్డి
అరెస్టును తీవ్రం ఖండించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన కోర్కెల అంశాలను పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తానని ఆయన మీడియాకు చెప్పారు. కాగా, బస్ భవన్‌కు ఆందోళన కారులు చేరుకునే అవకాశం ఉన్నందున ఆ ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేశారు. సుమారు రెండు కిలోమీటర్ల ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు, బస్‌భవన్, వీఎస్టీ, రాంనగర్ చౌరస్తా, విద్యానగర్ చౌరస్తా వైపు భారీ సంఖ్యలో మోహరించారు. రహదారులకు అడ్డంగా బారీకేడ్లను ఏర్పాటు చేశారు. అటువైపు ఎవరినీ అనుమతించలేదు. సాధారణ వ్యక్తులను సైతం క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 97 బస్ డిపోల వద్ద బస్‌రోకోలు ఉద్రిక్తతకు దారీ తీశాయి. బస్‌లను బయటికి రాకుండా కార్మికులు అడ్డుకున్నారు. ఖమ్మంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ క్యాంపు కార్యాలయంలోకి కార్మికులు చొచ్చుకుని పోవడానకి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అయినా, క్యాంపు గోడలు దూకి లోపలికి ప్రయత్నించగా పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో కార్మికులకు గాయాలు తగిలాయి. అధికార పార్టీ తెరాస ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని ఎమ్మెల్యేలకు సూచించారు. కాగా, పట్ణణ, గ్రామీణ ప్రాంతల్లో కార్మికులు బైక్ ర్యాలీలు నిర్వహించారు. పరిస్థితి అదుపు తప్పుతున్నదని గ్రహించి నిరసన కారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. మహబూబ్‌నగర్‌లో ఇంటికి తాశం వేసుకుని మహిళా కార్మికులు దీక్షలకు దిగారు. అయితే, పోలీసులు ఇంటి తలుపులు బద్దలుకొట్టి దీక్షలను భగ్నం చేశారు. బస్‌రోకోలో పాల్గొన్న వేలాది మంది కార్మికులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇలావుంటే, ఆర్టీసీ సమ్మె శనివారానికి 44 రోజుకు చేరుకుంది.

*చిత్రం... ఇంటి వద్దే నిరశనకు దిగిన ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి, మద్దతు ప్రకటిస్తున్న ఉద్యోగినులు