రంగారెడ్డి

ఊపందుకున్న ఎన్నికల ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జనవరి 16: బోడుప్పల్‌లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు ప్రచారంలో పోటీ పడుతున్నారు. చెంగిచర్లలో బింగి జంగయ్య యాదవ్, కొత్త లక్ష్మీ రవి గౌడ్, కొత్త చందర్ గౌడ్, జడిగె మంజుల, రమేశ్, ఎం.లావణ్య శేఖర్ రెడ్డి, బొమ్మక్ సుగుణ బాలయ్య, బొమ్మక్ విజయలక్ష్మి, బొమ్మక్ విశ్వనాధ్, రాసాల వెంకటేశ్ యాదవ్, తోటకూర చందర్ యాదవ్, నత్తి మైసయ్య ప్రచారాన్ని నిర్వహిస్తూ గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
దూసుకెళ్తున్న బీజేపీ అభ్యర్థులు
బోడుప్పల్‌లో బీజేపీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. డివిజన్ల వారిగా ఏర్పుల మహేష్, శ్యామ రాణి, ఐలయ్య యాదవ్, రాసాల బాలమణి, మాడుగుల శివరాణి శివ, కుంభం కిరణ్ కుమార్ రెడ్డి, ఎస్‌ఎం.ప్రగతి, గోనె మాధురి శ్రీనివాస్, బజారు అమృత టీఆర్‌ఎస్‌కు ధీటుగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 7వ డివిజన్ అభ్యర్థి రాసాల బాలమణి, 11వ డివిజన్‌లో శివరాణికి విజయావకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. టీఆర్‌ఎస్ అవినీతికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసికెళ్లుతూ చేపట్టిన ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారం
బోడుప్పల్‌లో టీఆర్‌ఎస్‌కు ధీటుగా కాంగ్రెస్ అభ్యర్థులలో మేయర్ అభ్యర్థి పోగుల నర్సింహా రెడ్డి, అభ్యర్థులు తోటకకూర అజయ్ కుమార్, హరిత యాదగిరి, కొత్త దుర్గమ్మ, పోగుల దిలిప్ రెడ్డి, రాపోలు ఉపేందర్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
ప్రచారంలో టీఆర్‌ఎస్ పెద్దలు
పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలో ఎన్నికల ప్రచారం పుంజుకుంది. టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారంలో ఇతర పార్టీ అభ్యర్థుల కంటే ముందంజలో ఉన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయానికి పార్టీ పెద్దలను రంగంలోకి దింపింది. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఎంఎల్‌సీ జనార్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎం.సుధీర్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నాయకులు డివిజన్ల వారిగా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మేడిపల్లిలోని ఒకటో డివిజన్ నుంచి బరిలో నిలిచిన మేయర్ అభ్యర్థి జక్క వెంకట్ రెడ్డి, ఇతర డివిజన్ల అభ్యర్థులు యాచారం మహేశ్వరి మహేష్, చెరుకు మమత మహేష్, మద్ది యుగంధర్ రెడ్డి, బోడపట్ల వసంత మోహన్ రెడ్డి, బండి రమ్య సతీష్, కుర్ర శివ కుమార్ గౌడ్, బండి లత శ్రీరాములు, బండి శ్రీనివాస్ గౌడ్, పల్ల భాస్కర్ రెడ్డి, ఎంపల్ల అనంత్ రెడ్డి, దొంతిరి కవిత హరిశంకర్ రెడ్డి, పప్పుల రాజేశ్వరి అంజిరెడ్డి గెలుపు కోసం ఇంటింటికీ తిరుగుతూ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను వివరిస్తూ కారుకు ఓటేసి టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. 26వ డివిజన్‌లో పప్పుల రాజేశ్వరికి విజయావకాశాలు కన్పిస్తున్నాయి.
అభ్యర్థుల ప్రచారం హోరు
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. 22వ డివిజన్ మేయర్ అభ్యర్థి వంగేటి ప్రభాకర్ రెడ్డి, పర్వతాపూర్ 5వ డివిజన్ నుంచి బొడిగె లక్ష్మీ ప్రభాకర్ గౌడ్, 2వ డివిజన్ నుంచి దనావత్ శ్రీలత, 21వ డివిజన్ నుంచి బండిరాళ్ల మంజుల, 20వ డివిజన్ నుంచి కౌడే పోచయ్య, 16వ డివిజన్‌లో టీ.రామేశ్వరమ్మ, 17వ డివిజన్ నుంచి తుంగతుర్తి రవి, 15వ డివిజన్ నుంచి బండారి మంజుల, 12వ డివిజన్ నుంచి కేశవ నాదం గౌడ్, 10వ డివిజన్ నుంచి కౌడే లతశ్రీ, 9వ డివిజన్ నుంచి నారోజు జంగాచారి, 6వ డివిజన్ నుంచి కొల్తూరి మహేష్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. టీఆర్‌ఎస్‌కు ధీటుగా ప్రచారాన్ని చేపట్టి ఇతర అభ్యర్థులకు గుబులు పుట్టిస్తూ గెలుపు దిశగా ముందుకు వెళ్తున్నారు.
బీజేపీ అభ్యర్థులు ప్రచారం
పీర్జాదిగూడలో బీజేపీ అభ్యర్థులు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. 13వ డివిజన్‌లో తూంకుంట్ల ప్రసన్న లక్ష్మి శ్రీ్ధర్ రెడ్డి, 3వ డివిజన్‌లో బండారి రాజమణి, 11వ డివిజన్‌లో మద్దూరి చిత్తరంజన్ రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గెలిపే లక్ష్యంగా ప్రణాళికబద్ధంగా వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తూ ఓటర్లకు దగ్గరవుతున్నారు.
గుబులు పుట్టిస్తున్న స్వతంత్ర అభ్యర్థులు
పీర్జాదిగూడలో ప్రధాన రాజకీయ పార్టీలకు ధీటుగా స్వతంత్ర అభ్యర్థులు ప్రచారంలో ముందుకు వెళ్తున్నారు. 13వ డివిజన్‌లో పన్నాల విజయ ఎల్‌ఎన్ రెడ్డి, 26వ డివిజన్‌లో ఎన్.సృజన, బైటింటి శారద ప్రచారంలో నువ్వా నేనా అనే తరహాలో ముందుకు వెళ్తున్నారు.