తెలంగాణ

ఉద్యోగుల భద్రత ఆర్టీసీ కర్తవ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగ, కార్మికల భద్రత ఆర్టీసీ కర్తవ్యం అంటూ సంస్థ ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ స్పష్టం చేశారు.సంస్థలో అత్యుత్తమ సేవలు అందించిన ఉద్యోగ, కార్మికులకు అవార్డులను ఎండీ అందచేశారు. శనివారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్‌లో ఏర్పాటు చేసిన అవార్డుల కార్యాక్రమంలో ఎండీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉద్యోగ, కార్మికుల నుద్దేశించి ఆయన మాట్లాడుతూ కెఎంపీఎల్ సాదించిన డ్రైవర్లు, బస్సుల మెయింటనెన్స్ ద్వారా ఇంధన పొదుపుకు దోహద పడిని మెకానికల్‌ను ఆయన అభినందించారు. సంస్థలో ఉద్యోగులు, అధికారులు మధ్య అంతరాలు లేకుండా కలసి పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు. ఉద్యోగల సంక్షేమ దిశగా మరో 10 రోజుల్లో సుభవార్త వింటారని ఆయన గుర్తు చేశారు. ఉద్యోగ, కార్మికుల భద్రత ఆర్టీసీ బాధ్యతగా తీసుకుంటుందన్నారు. ఉద్యోగులు ఎక్కడైనా తప్పులు చేస్తే వారికి కౌన్సిలింగ్ ద్వారా సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఆర్టీసీ ఉద్యోగ, కార్మికులు బోనస్ తీసుకోబోతున్నారని అన్నారు. అందుకు ప్రతి ఉద్యోగి సంస్థపై నిబద్ధతతో పని చేయాల్సి ఉందన్నారు. సీసీఎస్, పిఎఫ్‌ల కోసం నిధుల సమీకరిస్తున్నామని చెప్పారు. మరో వారంలోపు ఉద్యోగ భద్రత కోసం మార్గదర్శకాలకు సంబంధించి ప్రకటన వెలువడుతోందన్నారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్లు పురుషోత్తం, వినోద్‌కుమార్, టీవీరావు, యాదగిరి, వెంకటేశ్వర్లు,ఎఫ్‌ఎం రమేష్, సీఎంఈ రఘునాథరావు, సంజీవ కుమార్, రోషిత్ గార్గ్ పాల్గొన్నారు. సంస్థ ఎండీ ఉద్యోగులతో సహపంక్తి భోజనం చేశారు.
*చిత్రం...ఆర్టీసీలో అత్యుత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు పురస్కారాలతో పాటు
అవార్డులు అందజేస్తున్న ఇన్‌చార్జి ఎండీ సునీల్‌శర్మ