తెలంగాణ

తెలంగాణలో ప్రైవేటు వర్సిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: తెలంగాణలో వివిధ సంస్థలు ప్రైవేటు యూనివర్శిటీలను ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరిస్తూ ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను జారీ చేసింది. మల్లారెడ్డి మహిళా వర్శిటీని మైసమ్మగూడలో ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపింది.
ఈ మేరకు మల్లారెడ్డి విద్యాసంస్థల కార్యదర్శికి ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి నుండి లేఖ జారీ అయ్యింది. ఈ ఎల్‌వోఐ ఆధారంగా విద్యాసంస్థ ఏర్పాటుకు అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాల్సి ఉంటుంది. మూడేళ్లపాటు 30 కోట్ల రూపాయిలను ఫిక్సిడ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ప్రాజెక్టు విలువలో ఒక శాతం ఎండోమెంట్ ఫండ్ చూపించాలి.
అదే విధంగా పది కోట్ల వ్యయంతో యూనివర్శిటీ స్థాయి భవనాలను నిర్మించాలి, లేదా భవనాలను చూపించాలి. ఆరు నెలల్లోగా ఆ నిర్మాణాలను , ఇతర వౌలిక సదుపాయాలను, బోధన, బోధనేతర సిబ్బందిని చూపించాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ పూర్తికాగానే ప్రభుత్వం లెటర్ ఆఫ్ అప్రూవల్‌ను జారీ చేస్తుంది.
మల్లారెడ్డి మహిళా వర్శిటీతో పాటు టెక్ మహేంద్ర వర్శిటీ ఏర్పాటుకు కూడా ఎల్‌వోఐ జారీ అయ్యింది. ఆ జాబితాలో గురునానక్ యూనివర్శిటీ, శ్రీనిధి, ఎస్‌ఆర్ విద్యాసంస్థలతో పాటు అనురాగ్, ఎంఎన్‌ఆర్, షాదాన్ తదితర విద్యాసంస్థలున్నాయి. వీటికి కూడా త్వరలోనే ఎల్‌ఓఐ జారీ కానుంది. మరో 20 విద్యాసంస్థలు సైతం ప్రైవేటు యూనివర్శిటీల ఏర్పాటుపై ఆసక్తిని చూపుతున్నాయి. ఇక్ఫాయి, గీతం, కెఎల్ యూనివర్శిటీ తదితర సంస్థలు కూడా దరఖాస్తు చేసినట్టు సమాచారం.
రిలయన్స్ లేనట్టే!
రాష్ట్రంలో రిలయన్స్ వంటి యూనివర్శిటీల ఏర్పాటు కోసమే ప్రైవేటు యూనివర్శిటీల బిల్లును తీసుకొచ్చినట్టు ప్రభుత్వం శాసనసభలో సమర్ధించుకున్నా, ఇంత వరకూ దరఖాస్తులు అన్నీ లోకల్‌వే వచ్చినట్టు తెలిసింది.
రిలయన్స్ వంటి సంస్థలు తొలుత ఆసక్తిని చూపినా, ప్రస్తుతానికి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ముందుకు వచ్చే అవకాశం కన్పించడం లేదు. ఉన్నత విద్యామండలి మాత్రం విదేశాల నుండి వస్తున్న ప్రతి యూనివర్శిటీతో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంటోంది తప్ప వాటికి స్పష్టమైన కార్యరూపాన్ని మాత్రం ఇవ్వడం లేదు. గత ఐదేళ్లలో 20కి పైగా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.