క్రీడాభూమి

రియో ఒలింపిక్స్‌కు రోయర్ దత్తు క్వాలిఫై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: భారత రోయర్ దత్తు బాబన్ భొకానల్ ఈఏడాది ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించాడు. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం దక్షిణ కొరియాలోని చుంగ్ జూలో జరిగిన ఆసియా/ ఓసియానియా ఒలింపిక్ క్వాలిఫికేషన్ రెగెట్టాలో పురుషు సింగిల్స్ స్కల్స్ ఈవెంట్‌లో పోటీపడిన అతను రజత పతకాన్ని సాధించాడు. రెండు కిలోమీటర్ల దూరాన్ని 25 ఏళ్ల దత్తు 7 నిమిషాల 7.63 సెకన్లలో పూర్తి చేశాడు. ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ సమయాన్ని అందుకోవడంతో అతనికి రియోలో పాల్గొనే అవకాశం దక్కింది. కాగా, పురుషుల లైట్ వెయిట్ డబుల్ స్కల్స్‌లో విక్రం సింగ్, రూపేంద్ర సింగ్ జోడీ ఐదో స్థానంతో సంతృప్తి చెందింది. ఫలితంగా ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించలేకపోయింది.
తొమ్మిదో రోయర్
భారత్ తరఫున ఒలింపిక్స్‌లో పాల్గొనే తొమ్మిది రోయర్‌గా దత్తు రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. ఇందర్ పాల్ సింగ్ 2000 సిడ్నీ ఒలింపిక్స్ పురుషుల కాక్స్‌లెస్ పెయిర్స్‌లో, పౌలోస్ పండరీ కనె్నల్ 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ పురుషుల సింగిల్ స్కల్స్‌లో, బజరంగ్ టక్కర్ 2008 బీజింగ్ ఒలింపిక్స్ పురుషుల సింగిల్ స్కల్స్‌లో, మన్జీత్ సింగ్/ దేవేందర్ ఖండ్‌వాల్ 2008 బీజింగ్ ఒలింపిక్స్ పురుషుల లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్, సవర్ణ్ సింగ్ 2012 లండన్ ఒలింపిక్స్ పురుషుల సింగిల్ స్కల్స్, మన్జీత్ సింగ్, సందీప్ కుమార్ 2012 లండన్ ఒలింపిక్స్ పురుషుల లైట్‌వెయిట్ డబుల్ స్కల్స్ విభాగంలో భారత్ తరఫున పోటీపడ్డారు. ఇప్పుడు దత్తుకు ఈ అవకాశం దక్కింది.