తెలంగాణ

తొలి మహిళా న్యూస్ రీడర్ మాడపాటి సత్యవతి కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 4: ఆకాశవాణి మాజీ న్యూస్ రీడర్ మాడపాటి సత్యవతి (80) బుధవారం నాడు తుది శ్వాస విడిచారు. తిరుమలగిరి శ్మశాన వాటికలో ఆమె అంతిమ సంస్కారం నిర్వహించారు. సత్యవతి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిలు వేర్వేరు ప్రకటనల్లో తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. లక్షలాది మంది శ్రోతల హృదయాల్లో సుస్థిరస్థానాన్ని సంపాదించుకున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు మాడపాటి సత్యవతి తన సుస్వరంతో రేడియో వార్తలు చదువుతూ తన హితులు, సన్నిహితులు, లక్షలాది శ్రోతల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. హైదరాబాద్ నగర మొదటి మేయర్ మాడపాటి హనుమంతరావు మనుమరాలే సత్యవతి. ఆమె హైదరాబాద్‌లో జన్మించారు. వారి సొంత ఊరు ఖమ్మం జిల్లా ఎర్కుపాలెం. తాత మాడపాటి హనుమంతరావు అన్న కొడుకు మాడపాటి రామచందర్‌రావు ఆయన కుమార్తె సత్యవతి. హనుమంతరావుకు కొడుకులు లేకపోవడంతో రామచందర్‌రావును, సత్యవతిని ఆయన పెంచుకున్నారు. ఆకాశవాణిలో తొలి మహిళా న్యూస్ రీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. వార్తావాహిని పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. మాడపాటి సత్యవతికి 2017లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట మహిళా పురస్కారాన్ని కూడా అందజేసింది. నగర మేయర్ మాడపాటి హనుమంతరావు మనుమరాలే సత్యవతి. క్లుప్తంగా, భావయుక్తంగా వార్తలు వినిపించడం ఆమె ప్రత్యేకత. నిజాం కాలం నాటి రజాకర్ల ఆకృత్యాలను కళ్లారా చూశారామె. తెలుగు చదవుకోవడంపై నిషేధం ఉన్న కాలంలోనే హనుమంతరావు స్థాపించిన తెలుగు బాలికల ఉన్నత పాఠశాలలో ఆమె చదువుకున్నారు.
*మాడపాటి సత్యవతి (ఫైల్‌ఫొటో)