తెలంగాణ

ఖిల్లాపై గులాబీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం/ హైదరాబాద్, ఏప్రిల్ 26: ఏళ్ల తరబడి వామపక్షాలకు పెట్టని కోటగావున్న ఖమ్మం ఖిల్లాను గులాబిమయం చేయాలన్న సంకల్పంతో తెరాస వ్యూహాత్మక ప్లీనరీ నిర్వహించబోతోంది. ప్రభుత్వ పనితీరు సమీక్ష, పథకాల అమలు, భవిష్యత్ కార్యాచరణ, పార్టీ విస్తరణలాంటివి పైకి కనిపించే లక్ష్యాలే అయినా, ఖిల్లాపై పూర్తి పట్టు సాధించేలా పార్టీని విస్తరించాలన్నదే తెరాస అంతర్గత వ్యూహం. ఈనేపథ్యంలో బుధవారం నిర్వహించే ప్లీనరీకి విస్తృత ఏర్పాట్లు చేశారు. మంగళవారం ప్లీనరీ ప్రాంగణం వద్ద ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వ రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి ప్లీనరీలోనే కీలక తీర్మానాలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఖమ్మంలో జరుగుతున్న ప్లీనరీలో అనేక తీర్మానాలు చేయనున్నామని, రాష్ట్భ్రావృద్ధికి ఇవి కీలకం కానున్నాయన్నారు. కరవు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై చర్చలు, తీర్మానాలు చేపట్టనున్నామన్నారు. ఖమ్మం ప్లీనరీలో జరిగే రాజకీయ తీర్మానం అందరికి ఆదర్శవంతంగా ఉంటుందన్నారు.
14 ఏళ్లపాటు సాగిన ఉద్యమకాలంలో ఖమ్మంలో తెరాస పరిస్థితి అంతంత మాత్రమే. ఆ జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల ఉద్యమకాలంలో తెరాస చొచ్చుకుపోలేకపోయింది. వామపక్షాల ప్రభావం, సామాజిక వర్గాల బలమైన పట్టు, జిల్లాపై ఆంధ్ర ప్రభావం ఎక్కువగా ఉండటం, అన్ని పార్టీల్లో ఆంధ్ర నాయకత్వం ఉండటమే అప్పటి ఆ పరిస్థితికి కారణం. అలాంటి ఖమ్మంలో ఎదిగేందుకు తెరాస వ్యూహాత్మకంగా వ్యవహరించడమే ప్లీనరీ నిర్వహణకు కారణం. నిజానికి ప్రత్యేక తెలంగాణ కోసం దీక్షకు దిగిన కెసిఆర్‌ను పోలీసులు రాత్రికి రాత్రి అరెస్టు చేసి ఉద్యమ ప్రభావం ఉండదనే ఉద్దేశంతో ఖమ్మం తరలించారు. అప్పటినుంచే జిల్లాలో తెలంగాణ ఉద్యమ కదలికలు మొదలయ్యాయి. తెరాస అధికారంలోకి రావడంతో క్రమంగా జిల్లాలో పార్టీ ప్రభావం పెరుగుతూ వచ్చింది. ఉద్యమకాలంలో ఏం చెప్పాం, అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ఏం సాధించాం అనే అంశంపై సమీక్షగా ప్లీనరీ నిర్వహిస్తున్నారు. భగీరథ, కాకతీయ, ఆసరా, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లవంటి పథకాల సమీక్ష, వీటిని జనంలోకి తీసుకెళ్లాల్సిన అవసరాన్ని సిఎం ప్లీనరీలో వివరించనున్నారు. మరోపక్క అధికారంలోకి వచ్చిన రెండేళ్లు పాలనపైనే దృష్టి పెట్టిన కెసిఆర్ పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో పార్టీ బలోపేతం, గతంలో ప్రకటించినట్టు పార్టీ శ్రేణులకు శిక్షణ తదితర అంశాలపై ప్లీనరీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
సిఎం పర్యటన వివరాలు
బుధవారం ఉదయం 9:30 గంటలకు టిఆర్‌ఎస్ జిల్లా పార్టీ నూతన కార్యాలయం నిర్మాణానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు భూమి పూజ చేస్తారని, 9:45 గంటలకు ఫోటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. అనంతరం సిఎం ప్లీనరీ వేదిక వద్దకు చేరుకొని 10:20 గంటలకు అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి, 10:25 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేస్తారన్నారు. 10:30 గంటలకు జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్లీనరీ స్వాగతోపన్యాసం చేస్తారని, అనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్లీనరీకి అధ్యక్షత వహిస్తూ 11 గంటలకు ప్లీనరీని ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. 12:30 గంటల నుంచి 1:30 గంటల వరకు తీర్మానాలు చేయనున్నారు. అనంతరం నేతల ప్రసంగాలతో పాటు ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్ష హోదాలో తుది ప్రసంగాన్ని చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రజలను, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.