ఈ వారం స్పెషల్

తొందర పడడం లేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-అంటోంది టాలీవుడ్ స్వీట్ సుందరి రకుల్ ప్రీత్‌సింగ్. పరిశ్రమలోకి వచ్చి కొంత కాలమే అయినా చేసిన చిత్రాలు, పోషించిన పాత్రల ద్వారా మంచి ఇమేజ్‌ని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. టాలీవుడ్ హీరోలందరి సరసన ఆడిపాడుతున్న ఈ అమ్మడికి ఇప్పుడు భలే అవకాశాలు చుట్టుముట్టేస్తున్నాయి. ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో ఎంతో బిజీగా వున్న రకుల్ వచ్చిన అవకాశాలను ఎడాపెడా ఒప్పేసుకోవడం లేదట. ఆచి తూచి అడుగులు వేస్తున్నానంటోంది. మంచి బ్యానర్లు..పేరున్న హీరోలు..మంచి కథలు..ఇలా ఒకటేమిటి? ఎన్నో విషయాలు ఆలోచిస్తుందట. ఈ విషయం గురించి రకుల్‌ని కదిలిస్తే- ‘‘టాలీవుడ్‌లోకి ఎన్నో ఆశలతో అడుగుపెట్టాను. మంచి చిత్రాల్లో మంచి క్యారెక్టర్లు చేసి అందరిచేత ప్రశంసలందుకోవాలనుకుంటున్నా. నేను కెరీర్ విషయంలో ఏ మాత్రం తొందరపడను’’అంటూ చెప్పుకొచ్చింది. వాహ్..రకుల్!!

-సమీర్