తెలంగాణ

బిసి, ఇబిసి వర్గాలకూ కల్యాణలక్ష్మి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 13: నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల వివాహాలకు ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం అందించడానికి ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మీ పథకాన్ని ఇక నుంచి వెనుకబడిన (బిసి), ఆర్థికంగా వెనుకబడిన (ఇబిసి) వర్గాలకు వర్తిం ప చేస్తున్నట్టు తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ మంత్రి జోగురామన్న ప్రకటించారు.
ఈ మేరకు ఈ వర్గాలకు చెందినవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి శుక్రవారం సచివాలయంలో మంత్రి వెబ్‌సైట్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి జోగురామన్న మీడియాతో మాట్లాడుతూ, గత నెల ఏప్రిల్ ఒకటి తర్వాత వివాహాలు జరిగిన ఈ వర్గాలకు చెందినవారు కళ్యా ణ లక్ష్మీ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ పథకం కింద ఆర్థిక సహాయం పొందడానికి అమ్మాయి తల్లిదండ్రులు గ్రామీణ ప్రాంతాలకు చెందినవారికైతే రూ. లక్ష యాబై వేలు, పట్టణ ప్రాంతాలకు చెందిన వారికైతే రూ. 2 లక్షల వార్షిక ఆదాయం కలిగి ఉన్నవారు మాత్రమే అర్హులని మంత్రి తెలిపారు. ఈ పథకం కింద ఈ ఏడాది 58,820 మంది వధువులకు లబ్ధిచేకూర్చడానికి రూ. 300 కోట్లు కేటాయించినట్టు మంత్రి వివరించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, వీరు మీసేవా ద్వారా పొందిన జన్మదిన పత్రం, కులదృవీకరణ పత్రం, ఆదాయ పత్రం పొందుపర్చాల్సి ఉంటుందన్నారు. వివాహం జరిగిన ఆరు నెలలలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని మంత్రి తెలిపారు. వధువు ఫోటో కలిగి ఉన్న బ్యాంక్ పాసు పుస్తకం, వివాహ పత్రిక, వివాహ రిజిస్ట్రేషన్ పత్రాలను దరఖాస్తుతో పాటు జత చేయాల్సి ఉంటుందన్నారు. కల్యాణ లక్ష్మీ పథకం కింద ఒకేసారి మాత్రమే లబ్థిపొందడానికి అర్హులన్నారు. కల్యాణ లక్ష్మీ పథకం కింద ప్రభుత్వం నుంచి అందించనున్న రూ. 51 వేలను నేరుగా వధువు ఖాతాలోనే జమ చేస్తామని మంత్రి జోగురామన్న వివరించారు.