కృష్ణ

పెరిగిన ‘పన్ను పోటు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మే 25: నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ పలు అంశాలకు ఆమోదం తెలిపింది. బుధవారం సాయంత్రం కౌన్సిల్ భవనంలో జరిగిన సమావేశంలో సభ్యులు కాకు మల్లికార్జున యాదవ్, చెన్నుపాటి గాంధీ, కె అనూరాధ, పి జగదాంబ తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో ప్రధానంగా నగరంలోని పార్కింగ్ ఫీజు చార్జీలను పెంచుతూ తీర్మానం చేయడం విశేషం. రైల్వేస్టేషన్, బస్టాండ్, సినిమా థియేటర్‌లలో వసూలు చేస్తున్న విధంగా విఎంసి పార్కింగ్ ప్రదేశాల్లోనూ ఫీజులను పెంచుతూ నిర్ణయం తీసుకొన్నారు. ప్రస్తుతం వసూలు చేస్తున్న ఫీజుపై రెట్టింపు ఫీజును వసూలు చేయాలని నిర్ణయించారు. అలాగే ప్రస్తుత మామిడి సీజన్‌లో విఎంసి తరఫున వసూలు చేసే సెస్ చార్జీలను కూడా పెంచారు. ప్రస్తుతం వసూలు చేస్తున్న బస్తా, గంప కు 5 నుంచి 10 రూపాయలు, 3/4 చక్రాల రిక్షా, లాగుడు బండికి 10 నుంచి 50 రూపాయలు, 3/4 చక్రాల వాహనాలు ఆటో, మినీ వ్యాన్ కు 50 నుంచి 150, 6 చక్రాల లారీకి 400, 10 చక్రాల భారీ వాహనానికి 600 రూపాయలుగా నిర్ణయిస్తూ స్టాండింగ్ కమిటీ తీర్మానం చేసింది. 13వ డివిజన్‌లోని కెజి గుప్తా కల్యాణ మండపం లీజు గడువు పెంపు, పాయకాపురంలోని ఎన్‌ఎస్‌సి బోస్ నగర్‌లో ఉన్న విఎంసి క్రిష్టియన్ కల్యాణ మండపం లీజు టెండర్‌లో అత్యధికంగా కోడ్ చేసిన కాంట్రాక్టర్‌కు టెండర్ ఖరారు చేస్తూ తీర్మానించారు. 12వ డివిజన్ దర్శిపేట చేపల మార్కెట్‌లో లీజుకాలం ముగిసిన ప్లాట్‌ఫారమ్ ల లీజు గడుపు పెంపునకు ఆమోదం తెలిపారు. కొత్తపేట, రామరాజ్యనగర్, రాజీవ్‌నగర్, కృష్ణలంక ప్రాంతాల్లో విఎంసి నిర్వహిస్తున్న మాతా శిశు సంరక్షణ కేంద్రాలలో విధులు నిర్వర్తించేందుకు గాను అవసరమైన 19 మంది సిబ్బందిని కాంట్రాక్ట్ పద్దతిపై నియమించిన సిబ్బంది నియామకాలకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. మలేరియా దోమల నివారణకు వినియోగించే పై రత్నం ఆయిల్ సరఫరాకు పిలిచిన టెండర్ ప్రక్రియలో విఎంసి కి అనుకూలంగా కోడ్ చేసిన టెండర్‌కు స్టాండింగ్ కమిటీ ఆమోదం లభించింది. వీటితోపాటు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 101 జీవో ప్రకారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ బడ్జెట్ కింద మంజూరైన 20 కోట్ల నిధుల వినియోగానికి సిద్దం చేసిన ఆయా పనుల అంచనాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. విఎంసి వెహికల్ డిపోలో ప్రజారోగ్య సెక్షన్ కింద పనిచేస్తున్న డ్రైవర్లు, క్లీనర్ల కాంట్రాక్ట్ పొడిగింపునకు ఆమోదం తెలపడే కాకుండా వారికి చెల్లించే జీత భత్యాల నిమిత్తం అవసరమైన నిధుల విడుదలకు ఆమోదం లభించింది. ఈ సమావేశంలో వివిధ విభాగాలకు చెందిన అధికార సిబ్బంది పాల్గొన్నారు.