తెలంగాణ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే చంపేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: ‘ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే లేపేస్తాం’ అని ఒక అజ్ఞాత వ్యక్తి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ శాసనమండలి (కౌన్సిల్)లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీకి ఫోన్‌లో బెదిరించారు. షబ్బీర్ అలీకి బెదిరింపు ఫోన్ రావడంపై టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి, టి.పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ తీవ్రంగా ఖండించారు. ఇలాఉండగా తనకు ల్యాండ్‌లైన్ (నెం.69542335) నుంచి బెదిరింపు ఫోన్ వచ్చిందని షబ్బీర్ అలీ శుక్రవారం సాయంత్రం జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎఐసిసి నాయకుడు, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డికి ఫోన్‌చేసి జరిగిన విషయాన్ని చెప్పారు. బెదిరింపు ఫోన్ చేసిన వ్యక్తిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు.
వ్యతిరేకంగా మాట్లాడితే చంపేస్తారా?
షబ్బీర్ అలీకి వచ్చిన బెదిరింపు ఫోన్‌కాల్‌ను ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జానారెడ్డి, భట్టివిక్రమార్క సీరియస్‌గా తీసుకున్నారు. శుక్రవారం సాయంత్రం ఉత్తమ్‌కుమార్ రెడ్డి నివాసంలో సమావేశమైన నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఉత్తమ్, జానారెడ్డి, భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, వారిని చంపేస్తారా? అని ప్రశ్నించారు. ఈ బెదిరింపు ఫోన్‌పై ప్రభుత్వ సమాధానం ఏమిటీ?, ప్రభుత్వం సమర్థిస్తుందా? లేక వ్యతిరేకిస్తుందా? అని వారు ప్రశ్నించారు. ‘ఏమిటీ ధైర్యం?, ఎవరి ప్రోద్బలంతో ఫోన్ చేశారు?’ అని వారు ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులను ప్రభుత్వం అనైతికంగా ప్రోత్సహిస్తున్నదని వారు విమర్శించారు. ప్రభుత్వ చర్యలు అనైతికంగా ఉన్నాయని దుయ్యబట్టారు.