తెలంగాణ

రైల్వే డిఎస్‌పిపై బదిలీ వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ జనార్థన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం తీవ్ర సంచలనం రేపుతోంది. ఎస్పీ కార్యాలయంలో పని చేసే సీనియర్ అసిస్టెంట్ కనకదుర్గను లైంగికంగా వేధించిన ఆరోపణలపై హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ రైల్వే పోలీసులు (జిఆర్‌పి) కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి రైల్వే డిఎస్పీ మురళీధర్‌పై శుక్రవారం బదిలీ వేటు పడింది. బాధితురాలి ఫిర్యాదుపై సరిగ్గా స్పందించని కారణంగా డిఎస్పీని బదిలీ చేస్తూ డిజిపి కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. మరికొంత మంది కింది స్థాయి అధికారులపైనా డిజిపి చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. రైల్వే ఎస్పీపై కేసు నమోదు అనంతరం అసలు వాస్తవం ఏమిటనే అంశంపై ప్రభుత్వ రైల్వే పోలీసు విభాగం శాఖాపరంగా అంతర్గత విచారణ చేపట్టినట్లు తెలిసింది.
విచారణ అనంతరం ఎస్పీపైనా చర్యలకు అవకాశం లేకపోలేదని విశ్వసనీయ సమాచారం. కాగా గతంలోనూ ఎస్పీ స్థాయి అధికారి ఒకరు ఇదేరకంగా లైంగిక వేధింపులకు పాల్పడితే చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలు కనకదుర్గ మీడియా ముందుకొచ్చి ఆరోపించారు. ఇంతేకాకుండా తనకు జరుగుతున్న అన్యాయం గురించి స్వయంగా మహిళా పోలీసు అధికారులకు చెప్పుకున్నా వాళ్లూ పట్టించుకోలేదని, పైగా తనకే బెదిరింపులు వచ్చాయని బాధితురాలు చెప్పారు. రైల్వే ఎస్పీ జనార్థన్‌కు తమ కార్యాలయంలోనే పనిచేస్తున్న మరో సీనియర్ అసిస్టెంట్ బాబూరావు, డిజిపి కార్యాలయంలో ఎఓగా పని చేస్తున్న మల్లికలు సహకరించారని ఆమె తెలిపారు. విధిలేని పరిస్థితిలో హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందని తెలిపారు.
కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు న్యాయం చేస్తారని ఆశిస్తున్నానని చెబుతున్నారు. అయితే బాధితురాలు చేస్తున్న ఆరోణలన్నీ అవాస్తవాలని ఎస్పీ కొట్టిపారేశారు. ఉన్నతాధికారులపై ఫిర్యాదులు చేయడం ఆమెకు అలవాటేనని చెబుతున్నారు. తాను 11 నెలలుగా రైల్వే విభాగంలో పని చేస్తున్నానని, తన వద్ద ఆమె గంట కూడా కార్యాలయ విధులు నిర్వహించలేదని, ఒకసారి ఫైల్‌పై సంతకం చేయించుకునేందుకు ఐదు నిమిషాలు వచ్చి వెళ్లడం తప్ప మరెప్పుడూ రాలేదని తెలిపారు. నకిలీ సర్ట్ఫికెట్లతో ఉద్యోగంలో చేరిన అంశంపై ఇప్పటికే విచారణ జరుగుతోందని, ఇదే అంశంపై తాను ప్రశ్నించినందుకు లైంగిక వేధింపుల ఆరోపణలు ఆమె చేస్తున్నారని తెలిపారు. తాను ఆ విషయంలో నివేదిక పంపించడం వల్ల తనపై తప్పుడు ఆరోపణలతో చేస్తోందన్నారు. విచారణకు పూర్తిగా సహకరిస్తామని, నిజాయితీని నిరూపించుకుంటానని ఎస్పీ చెబుతున్నారు. రైల్వే పోలీసులు ఎస్పీ సహా మిగిలిన ఇద్దరిపై సెక్షన్ 354, 506 కింద కేసు నమోదు చేశారు.