తెలంగాణ

బిజెపి వల్లే ఎదిగా: వెంకయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తాను రాజకీయాల్లో ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని పదవులను చేపట్టినా అందుకు తల్లిలాంటి భారతీయ జనతా పార్టీయే కారణమని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు భావోద్వేగంతో అన్నారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికై తొలిసారిగా హైదరాబాద్ వచ్చిన ఆయనకు శుక్రవారం పార్టీ కార్యకర్తలు, నాయకుల నుంచి ఘన స్వాగతం లభించింది. పార్టీ కార్యాలయంలో సన్మానం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పదవి ఉన్నా లేకున్నా పార్టీ కోసం, ప్రజల కోసం తాను నిరంతరం పనిచేస్తానని అన్నారు. ఎంతోమంది నేతలకు పార్టీ ద్వారానే మంచి అవకాశాలు లభించాయన్నారు. ప్రజల కోసం కార్యకర్తలు, నాయకులు అంకితభావంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ నేతలు లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, రాంచందర్‌రావు, చింతల రామచంద్రారెడ్డి తదితరులు హాజరయ్యారు.