కృష్ణ

పిహెచ్‌సీకి బాడీ స్కానర్ బహూకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోట్లవల్లూరు, జూన్ 23: తోట్లవల్లూరును దత్తత తీసుకున్న పారిశ్రామికవేత్త పొట్లూరి రాజమోహన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బయో క్వాంటం రిజోలెన్స్ మేగ్నటిక్ ఎనలైజర్ సిస్టంను బహూకరించారు. ఈ పరికరాన్ని బుధవారం బెంగళూరు నుంచి పీహెచ్‌సీకి పంపించారని డాక్టర్ గోపాలనాయక్, మంజూష గురువారం తెలిపారు. గత నెలలో పీహెచ్‌సీని రాజమోహన్ సందర్శించినపుడు రోగులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని, అందులో భాగంగా దీన్ని బహూకరించారని డాక్టర్లు తెలిపారు. కంప్యూటర్ సహాయంతో రోగి శరీరాన్ని స్కాన్ చేస్తారని, గుండె ఆరోగ్య పరిస్థితి, ఎముకల సమస్యలు, బిపి, ఇతర సమస్యలను బయో క్వాంటం సిస్టం తెలియజేస్తుందన్నారు. దీనికి సంబంధించిన నిపుణులతో చర్చించి త్వరలో రోగులకు చికిత్సలు అందిస్తామని గోపాలనాయక్ వివరించారు.