క్రీడాభూమి
మెస్సీ అభిమానుల భారీ ర్యాలీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బ్యూనస్ ఎయిర్స్, జూలై 3: అర్జెంటీనా సాకర్ సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పడాన్ని జీర్ణించుకోలేకపోతున్న వేలాది మంది అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించి, ఆ నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందిగా నినాదాలు చేశారు. అర్జెంటీనా తరఫున మెస్సీ మ్యాచ్‌లు ఆడాలని, మరికొంత కాలం అతను కెరీర్‌ను కొనసాగించాలని కోరారు. మెస్సీకి అనుకూలంగా ప్లకార్డులను ప్రదర్శించారు. ఇటీవల జరిగిన కోపా అమెరికా ఫైనల్లో అర్జెంటీనా ఓటమిపాలు కావడంతో మెస్సీ అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. అర్జెంటీనాకు ఇకపై ప్రాతినిథ్యం వహించనని, క్లబ్ స్థాయి టోర్నీలకే పరిమితమవుతానని అతను ప్రకటించాడు. అయితే, మెస్సీ తీసుకున్న నిర్ణయం అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. డిగో మారడోనాసహా పలువురు మాజీ క్రీడాకారులతోపాటు ఎంతో మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా మెస్సీని రిటైర్మెంట్ నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందిగా కోరారు. అభిమానులు ర్యాలీలు నిర్వహిస్తూ అతనిపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా వినిపిస్తున్న డిమాండ్‌కు మెస్సీ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.