అంతర్జాతీయం

హేయం.. అమానుషం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైస్ (ఫ్రాన్స్), జూలై 15: ఫ్రాన్స్‌లోని నైస్ నగరంలో ఆ దేశ జాతీయ దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న ప్రజలపై జరిగిన ఉగ్రవాద దాడి పట్ల ప్రపంచంలోని వివిధ దేశాల నేతలు దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల బీభత్సకాండను తీవ్రంగా ఖండించారు. ఈ ఉగ్రవాద దాడికి గురయిన ఫ్రాన్స్‌కు, ఆ దేశ ప్రజానీకానికి సంఘీభావం ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నైస్‌లో ప్రజలపై జరిగిన దాడి భయంకరమైన ఉగ్రవాద దాడిగా కనపడుతోందని పేర్కొంటూ, ఈ దాడిలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు ప్రగాఢ సానుభూతిని, సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి జాన్‌కెర్రీ ఈ దాడిని ఓ భయంకరమైన దాడిగా అభివర్ణించారు. అంతకుముందు పారిస్‌లో జరిగిన ‘బాస్టీల్ డే’ (ఫ్రాన్స్ జాతీయ దినోత్సవం)లో ఆ దేశ నాయకులతో కలిసి పాల్గొన్నందుకు తాను గర్వపడుతున్నానని పేర్కొంటూ అమెరికా ఈ విషాద సమయంలో ఫ్రాన్స్ ప్రజల పక్షాన దృఢచిత్తంతో నిలబడుతుందని అన్నారు. అమెరికా అధ్యక్ష పదవికి తలపడుతున్న ఇద్దరు అభ్యర్థులు హిల్లరీ క్లింటన్ (డెమొక్రటిక్ పార్టీ), డొనాల్డ్ ట్రంప్ (రిపబ్లికన్ పార్టీ) ఫ్రాన్స్‌పై జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. ట్రంప్ దీనిని యుద్ధంగా ప్రకటించగా, హిల్లరీ ప్రతి అమెరికా పౌరుడు ఫ్రాన్స్ ప్రజల పక్షాన గట్టిగా నిలబడతారని పేర్కొన్నారు.
ఉగ్రవాదులు నిరాశానిస్పృహలతో నైస్‌లో ప్రజలపై జరిపిన క్రూరమైన దాడి తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాన్‌కు పంపించిన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరులో ఫ్రాన్స్, ఇతర దేశాలతో రష్యా కలిసి పనిచేస్తుందని ఆయన అన్నారు.
నైస్‌పై ఉగ్రవాద దాడిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ డొనాల్డ్ టస్క్ ప్రపంచమంతా సంఘటితంగా ఫ్రాన్స్ ప్రజల పక్షాన నిలబడుతుందని అన్నారు. ట్రక్కు దాడి పట్ల జపాన్ తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
తీవ్రంగా ఖండించిన రాష్టప్రతి, ప్రధాని
న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌పై ఉగ్రవాద దాడిని భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తదితరులు శుక్రవారం తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదులు పక్కా ప్రణాళికతో చిన్న పిల్లలు సహా అమాయక ప్రజలను సామూహికంకా వధించిన ఈ సంఘటన మాటల్లో వర్ణించలేనిదని వారు పేర్కొన్నారు. ఉగ్రవాదుల క్రూరమైన దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి తీవ్ర సంతాపం తెలుపుతున్నట్లు ప్రణబ్ ముఖర్జీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. భారత్ ఫ్రాన్స్ ప్రజల పక్షాన నిలబడుతుందని పేర్కొన్నారు. ఫ్రాన్స్ ప్రజలకు భారత్ తరపున సంఘీభావాన్ని, సానుభూతిని వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల ఉన్మాద చర్యకు గురయిన ఫ్రాన్స్ ప్రజల పక్షాన భారత్ నిలబడుతుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దాడిలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. శాంతి, ప్రజాస్వామిక విలువలపై ఉగ్రవాదులకు ఉన్న ఆగ్రహాన్ని ఈ దాడి ప్రతిబింబిస్తోందని సోనియాగాంధీ పేర్కొన్నారు.
chitram...
నరమేధం సృష్టించిన వాహనం ఇదే