తెలంగాణ

వచ్చే ఎన్నికల నాటికి దక్షిణాదిలో పార్టీ విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూలై 31: భారత ప్రధాని మోదీ ఈనెల 7న తెలంగాణ పర్యటన ఖరారైందని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. ఆదివారం వరంగల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన తెలిపారు. గత రెండేళ్లలో తెలంగాణలో వౌలిక సదుపాయాల కల్పనకు 45 వేల కోట్లు కేటాయించిందన్నారు. అంతేకాకుండా అనేక కొత్త కొత్త సంస్థలు కూడా తెలంగాణకే కేటాయించిందన్నారు. ఎయిమ్స్, గిరిజన, కాళోజీ హెల్త్ యూనివర్సిటీలు, టెక్స్‌టైల్ పార్క్‌లు కూడా తెలంగాణకే కేటాయించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రధాని మోదీ పర్యటన తెలంగాణలో కీలకదినమని, ఈ పర్యటనను బిజెపి సద్వినియోగం చేసుకొని పార్టీని బలోపేతం చేసే విధంగా ముందుకు పోతామన్నారు. వచ్చే ఎన్నికల నాటికి ద క్షిణాదిలో విస్తరిస్తామని తెలిపారు. దేశంలో బిజెపిని బలోపేతం చేసేందుకు గుర్తించిన ఏడు ప్రాంతాల్లో తెలంగాణ ఒకటన్నారు. ఇప్పటికే రెండుసార్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణకు వచ్చారని, సెప్టెంబర్ 17న జరిగే తెలంగాణ విమోచన ఉత్సవాల్లో కూడా ఆయన పాల్గొంటారన్నారు. రాజకీయంగా తెలంగాణలో బలమైన శక్తిగా ఎదుగుతామని, ఇప్పటికే తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని, పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతుందని ఆయన అన్నారు. ఎంసెట్-2 లీక్‌పై డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి బాధ్యత వహించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ అసమర్థత వల్లే ఎంసెట్-2 లీకైందని, దీంతో వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైందన్నారు.

కేంద్రం నిధులు కూడా ప్రభుత్వం సరిగా వినియోగించుకోవడం లేదని తెలిపారు. ఈ నెల 7న ప్రధాని మోదీ తెలంగాణ పర్యాటనలో భాగంగా హైదరాబాద్‌లో జరిగే పార్టీ కార్యకర్తల బూత్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారని తెలిపారు. ప్రజాస్వామ్యవాదులంతా బిజెపితో కలిసిరావాలని, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తిస్థాయిలో బాధ్యత తీసుకుంటుందన్నారు. విలేఖరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఎం. ధర్మారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావు పద్మాఅమరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.