తెలంగాణ

జూరాలకు ఇక భారీ వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, ఆగస్టు 3: వారం రోజులుగా ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు వరదనీటి ఉధృతి పెరిగింది. బుధవారం ఆల్మట్టి ప్రాజెక్టు 26 గేట్లు అర సెంటీమీటర్ ఎత్తుకు, నారాయణపూర్ డ్యాం 17 గేట్లు ఒక మీటర్ ఎత్తుకు తెరిచి దిగువకు జూరాల వైపు నీటిని వదులుతున్నట్లు జూరాల వరద నియంత్రణ కార్యాలయ అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం నాటికి జూరాల జలాశయంలో 317.00 మీటర్ల స్థాయిలో నీటి నిల్వ ఉండగా, ఎగువ ప్రాంతం నుండి 20 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం దిగువకు 28,065 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ కాలువలకు 600 క్యూసెక్కులు, సమాంతర కాలువకు వెయ్యి క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 317 క్యూసెక్కులు, నెట్టెంపాడుకు 1700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఆల్మట్టి 26 గేట్లు ఎత్తివేత
ఎగువ ప్రాంతం నుండి భారీగా వరద నీరు ఆల్మట్టి జలాశయానికి వచ్చి చేరుతుండడంతో అక్కడి ప్రాజెక్టు అధికారులు జలాశయంలో 519.460 మీటర్ల స్థాయిలో నీటిని నిల్వ ఉంచుకొని దిగువకు 26 గేట్లను అర సెంటీమీటర్ ఎత్తుకు తెరిచి దిగువకు 1,43,387 క్యూసెక్కులను వదులుతున్నారు. ఎగువ ప్రాంతం నుండి ఆల్మట్టి జలాశయానికి 40,549 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. నారాయణపూర్ జలాశయంలో 491.970 మీటర్ల స్థాయిలో నీటిని నిల్వ ఉంచుకొని దిగువకు 17 గేట్లను ఒక మీటర్ ఎత్తుకు తెరిచి 1,03,580 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుండి 42,508 క్యూసెక్కుల వచ్చి చేరుతోంది.