క్రీడాభూమి

ఒలింపిక్స్‌ క్రీడా వేడుకలు అట్టహాసంగా ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జనీరో : భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున మారకానా స్టేడియంలో 31వ ఒలింపిక్స్‌ క్రీడా వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 6 వేల మంది కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అభినవ్‌ బింద్రా ఆరంభోత్సవంలో జాతీయ జెండాతో భారత బృందానికి నాయకత్వం వహించాడు. ఈసారి భారత్‌ నుంచి రికార్డు స్థాయిలో 118 మంది ఒలింపిక్స్‌ బరిలోకి దిగుతున్నారు. ఒలింపిక్స్‌ చరిత్రలో భారత ఆటగాళ్ల సంఖ్య వంద దాటడం ఇదే తొలిసారి. మారకానా మైదానం సహా మొత్తం 37 వేదికల్లో ఈ వేడుకలు 21 వరకు జరగనున్నాయి.