క్రీడాభూమి

మహిళల హాకీలో నిరాశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనిరో, ఆగస్టు 9: ఒలింపిక్ మహిళల హాకీ ఈవెంట్‌లో భారత జట్టుకు రెండో లీగ్ మ్యాచ్‌లో చుక్కెదురైంది. లండన్ ఒలింపిక్స్ కాంస్య పతకాన్ని గెలుచుకున్న గ్రేట్ బ్రిటన్ జట్టుతో జరిగిన మంగళవారం తెల్లవారు జామున జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో భారత జట్టు 0-3 గోల్స్ తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇంతకు ముందు జపాన్‌తో జరిగిన ఆరంభ మ్యాచ్‌ను 2-2 గోల్స్‌తో డ్రాగా ముగించిన భారత జట్టు ఈ మ్యాచ్‌లో ఆశించిన విధంగా రాణించలేక చతికిలబడింది. ఆరంభంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆడిన బ్రిటన్ జట్టు రెండో పావు భాగంలో విజృంభించింది. 25వ నిమిషంలో గిసెల్లీ ఆన్స్‌లీ శక్తివంతమైన డ్రాగ్‌ఫ్లిక్‌తో బ్రిటన్‌కు తొలిగోల్‌ను సాధించిపెట్టగా, ఆ తర్వాత కొద్దిసేపటికి నికోలా వైట్ రెండో గోల్‌ను అందించింది. దీంతో ప్రథమార్థం ముగిసే సమయానికే 2-0 గోల్స్ తేడాతో వెనుకబడిన భారత జట్టుకు ద్వితీయార్థంలో అలెక్స్ డాసన్ మరో షాక్ ఇచ్చింది. 33వ నిమిషంలో ఆమె అద్భుతమైన గోల్ సాధించి బ్రిటన్ ఆధిక్యతను 3-0కు పెంచింది. ఆ తర్వాత భారత క్రీడాకారిణులు ఎంతగా పోరాడినప్పటికీ ఒక్క గోల్ కూడా సాధించలేకపోయారు. మిగిలిన లీగ్ మ్యాచ్‌లలో భారత జట్టు బుధవారం ఆస్ట్రేలియాతోనూ, గురువారం అమెరికాతోనూ, 13న అర్జెంటీనా జట్టుతోనూ తలపడనుంది.