క్రీడాభూమి

స్పెయిన్‌తో పోరుకు మళ్లీ అదే జట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 30: స్పెయిన్‌తో వచ్చే నెల 16 నుంచి 18వ తేదీ వరకు జరిగే డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే-ఆఫ్ పోరులో తలపడే నలుగురు సభ్యుల భారత జట్టులో వెటరన్ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్, రోహన్ బొపన్న జోడీకి ఎఐటిఎ (అఖిల భారత టెన్నిస్ సంఘం) సెలెక్షన్ కమిటీ మళ్లీ చోటు కల్పించింది. ఎస్‌పి.మిశ్రా నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ మంగళవారం వీరిద్దరితో పాటు గత నెలలో దక్షిణ కొరియాపై 1-4 తేడాతో విజయం సాధించిన భారత జట్టును దాదాపు యథాతథంగా ఎంపిక చేసింది. అయితే భారత జట్టులోని రిజర్వు సభ్యుల్లో విష్ణువర్థన్‌కు బదులుగా ప్రగ్నేశ్ గణేశ్వరన్‌కు చోటు కల్పించి మరో రిజర్వు సభ్యుడిగా సుమిత్ నాగల్‌ను యథాతథంగా ఉంచారు. దీంతో స్పెయిన్‌పై సింగిల్స్ విభాగంలో జరిగే పోరులో సాకేత్ మైనేనేని, రామ్‌కుమార్ రామనాథన్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
స్పెయిన్‌తో తలపడే భారత జట్టులో కొత్త జోడీకి అవకాశాన్ని కల్పించే విషయాన్ని పరిశీలించారా? అని విలేఖర్లు ప్రశ్నించగా, లేదని మిశ్రా సమాధానమిచ్చాడు. ‘స్పెయిన్ చాలా బలమైన జట్టు. కనుక ప్రయోగాలు చేసేందుకు ఇది సరైన సమయం కాదు. యూకీ బాంబ్రీ, సోమ్‌దేవ్ దేవర్మన్ గాయాల పాలైనందున ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న ఆటగాళ్లలో లియాండర్ పేస్, రోహన్ బొపన్న జోడీయే అత్యుత్తమమైనది’ అని మిశ్రా చెప్పాడు. ఇంతకుముందు జరిగిన పోరులో భారత్ కంటే ఎంతో బలహీనమైన కొరియా జట్టుపై పేస్, బోపన్న జోడీ విజయం సాధించినప్పటికీ కొద్ది రోజుల క్రితం ముగిసిన రియో ఒలింపిక్ క్రీడల్లో వీరిద్దరూ తొలి రౌండ్‌లోనే ఓటమిపాలై నిష్క్రమించిన విషయం విదితమే.
స్పెయిన్‌తో తలపడే భారత జట్టు ఇదే..
సింగిల్స్: సాకేత్ మైనేని, రామ్‌కుమార్ రామనాథన్. డబుల్స్: రోహన్ బొపన్న, లియాండర్ పేస్. రిజర్వ్ ఆటగాళ్లు: ప్రగ్నేశ్ గణేశ్వరన్, సుమిత్ నాగల్.
డేవిస్ కప్‌కు పేస్, బోపన్న జోడీ యథాతథం