తెలంగాణ

ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడే రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 1: పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితుల పునరావాస, సహాయ చర్యల పూర్తి కోసం 115 కోట్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబుకు లేఖ రాసినట్లుగా ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. గురువారం నల్లగొండలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన లేఖలోని అంశాలను వెల్లడిస్త్తూ పులిచింతలతో ముంపునకు గురైన 13 గ్రామాల ప్రజలకు సహాయ, పునరావాస చర్యలకు ఏపి ప్రభుత్వం నుండి 115 కోట్లు రావాల్సివుందన్నారు. అలాగే పులిచింతల కింద మూడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లకు 48 కోట్ల ప్రతిపాదనలను ఏపికి సమర్పించారన్నారు. ఏపి ప్రభుత్వం నుండి నిధులు అందకపోవడంతో ముంపులిచింతల నిర్వాసితులకు
రూ.115 కోట్లు ఇవ్వాలి
ఏపి సిఎం చంద్రబాబుకు ఎంపి గుత్తా లేఖ
కెసిఆర్పు గ్రామాల ప్రజలకు పూర్తిగా ఆర్‌ఆండ్‌ఆర్ ప్యాకేజీ అసంపూర్తిగా మిగిలిందని దీంతో వారు గ్రామాల ఖాళీకి మొండికేస్తున్నారన్నారు. అయితే నల్లగొండ కలెక్టర్, జెసి వారిని ఒప్పించి సహాయ పునరావాసాలపై భరోసానిచ్చి వారిని ముంపు గ్రామాల నుండి పునరావాస గ్రామాలకు తరలిస్తున్నారన్నారు. రెండు ప్రాజెక్టుల పరిధిలోని నిర్వాసిత ప్రజలకు నష్టపరిహారం, పునరావాసం చెల్లింపునకు వెంటనే 115 కోట్లు మంజూరు చేసేలా చంద్రబాబు చర్యలు తీసుకోవాలని గుత్తా కోరారు. కాగా, టిఆర్‌ఎస్‌లో చేరిన క్రమంలో పుష్కరాల తర్వాత ఎంపి పదవికి రాజీనామా చేస్తానన్న ప్రకటనపై గుత్తా స్పందిస్త్తూ సిఎం కెసిఆర్ ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు.