తెలంగాణ

బాసరలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, అక్టోబర్ 1: ఆదిలాబాద్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో శనివారం శ్రీ శారదీయ నవరాత్రి ఉత్సవాలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు శైలపుత్రి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 9 గంటలకు ఆలయంలో కలశపూజ కార్యక్రమాన్ని కన్నులపండువగా నిర్వహించి ఘటస్థాపనతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఆలయంలోని యాగమండపంలో వేద పండితులు, అర్చకులు క్షేత్ర తీర్థపూజ, గణపతిపూజ, స్వస్తిపుణ్యాహవచనం, తదితర పూజలను ఘనంగా ని ర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డి, ఆలయ ఈవో ఎం.వెంకటేశ్వర్లు సర్పంచ్ శైలజా సతీశ్వర్‌రావు, చైర్మన్ శరత్‌పాఠక్ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. మొదటిరోజు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ, ఆంధ్ర, మహారాష్టల్ర నుండి భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భైంసా పట్టణానికి చెందిన డి.రమేష్ దంపతులు అమ్మవారికి రెండు తులాల బంగారుహారాన్ని అభిషేక సేవలో ఆలయ ఈవోకు అందజేశారు. ఈ సందర్భంగా దాతలను ఆలయం తరపున ఘనంగా సత్కరించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

చిత్రం.. పూజా కార్యక్రమంలో పాల్గొన్న ముధోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి