తెలంగాణ
చిన్నారిని చిదిమేసిన స్కూల్‌వ్యాన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 22 October 2016
చండూరు, అక్టోబర్ 21: నల్లగొండ జిల్లా చండూరు మండలం గొల్లగూడెం గ్రామంలో శుక్రవారం సాయంత్రం స్కూల్ వ్యాన్ ఢీకొనడంతో చిన్నారి కడారి పావని (3) దుర్మరణం చెందింది. చండూరు కృష్ణవేణి పాఠశాలకు చెందిన స్కూల్ వ్యాన్ విద్యార్థులను దించేందుకు గొల్లగూడెంవచ్చింది. ఈ నేపథ్యంలో ఇంటి ముందు ఆడుకొంటున్న పావని వ్యాన్ వెనుక చక్రాలకు తగలడంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. పావని తల్లి గీత తన రెండో కాన్పు కోసం పుట్టింటికి దసరా పండుగా సందర్భంగా వచ్చి ఇక్కడే కూతురుతో ఉంది. ఆడుకుంటున్న పావని ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు ముత్యాలు, గీతలు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగి పోయారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ భాస్కర్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.