కృష్ణ

పెడన అభివృద్ధికి ఎమ్మెల్యే కాగితతో కలిసి పయనిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, అక్టోబర్ 24: పెడన నియోజకవర్గ అభివృద్ధికై శాసనసభ్యులు కాగిత వెంకట్రావుతో కలిసి పని చేయనున్నట్లు ఇటీవల వైకాపాకు రాజీనామా చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ డెప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ పరంగా ఇప్పటి వరకు ఎమ్మెల్యే కాగిత వెంకట్రావుతో విభేదాలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ పక్కన పెట్టి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్భ్రావృద్ధికి తనవంతు సేవలు అందించేందుకు టిడిపిలో చేరినట్లు తెలిపారు. టిడిపిలో సీనియర్ నాయకుడైన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు సలహాలు, సూచనలను గౌరవిస్తూ వాటికి అనుగుణంగా నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. టిడిపిలో తన చేరికను కాగిత వెంకట్రావు సాదరంగా ఆహ్వానించారన్నారు. తామిద్దరం గతాన్ని పక్కనపెట్టి నియోజకవర్గంలో నెలకొన్న ప్రధాన సమస్య అయిన సాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేయనున్నట్లు చెప్పారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో సాగునీటి సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన చంద్రబాబు సమస్య పరిష్కారానికి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారన్నారు. దాని ఫలితంగా బంటుమిల్లి కాలువకు 600 క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు తెలిపారు. రానున్న రెండు రోజుల్లో శివారు ప్రాంతాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. పదవుల కోసం పార్టీలు మారుతున్నానని తనపై కొంత మంది చేస్తున్న ఆరోపణలను వ్యాస్ తిప్పికొట్టారు. తాను మొదటి నుండి కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్నానన్నారు. అయితే ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సమయంలో బంధుత్వాల కారణంగా ఆ పార్టీలో చేరాల్సి వచ్చిందన్నారు. ఆ తరువాత చిరంజీవి పిఆర్‌పిని కాంగ్రెస్‌లోకి విలీనం చేసిన తరువాత కాంగ్రెస్‌లో కొనసాగానన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అవలంభించిన విధానాల కారణంగా ఆ పార్టీ రాష్ట్రంలో భూస్థాపితమైందన్నారు. నామరూపాలు లేకుండా పోయిన కాంగ్రెస్‌లో ఉండలేక వైకాపాలో చేరాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఆ తరువాత వైకాపాలో వైకాపా అధినాయకత్వ తీరు నచ్చక, ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్భ్రావృద్ధికి పడుతున్న శ్రమను చూసి మాత్రమే టిడిపిలో చేరానన్నారు. పదవుల కోసం పార్టీలు మారే వ్యక్తిత్వం నాదికాదన్నారు. మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అధారిటీ ఛైర్మన్ పదవి తనకు ఇస్తారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. పోర్టు, పరిశ్రమలకు అవసరమైన భూముల విషయంలో గతంలో తాను చేసిన ప్రకటనలకే కట్టుబడి ఉన్నానన్నారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను తీసుకున్న తరువాత పోర్టు, పరిశ్రమల కోసం భూసమీకరణ చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటిసిలు బూరగడ్డ శ్రీకుమార్, అంబటి కాంతారావు, టిడిపి నాయకులు వెలివల చినబాబు, పుప్పాల నరసింహారావు, బత్తిన త్రినాధ్ తదితరులు పాల్గొన్నారు.