తెలంగాణ

జిల్లాల విభజనతో పనుల్లో వేగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 27: జిల్లాల విభజన వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పథకాల అమలులో మరింత వేగం పెరుగుతుందని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. పంచాయితీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు గురువారం సమావేశం అయ్యారు. తెలంగాణలో ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న పలు పథకాల అమలు తీరు తెలుసుకున్నారు. కార్యక్రమాల అమలు తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచ బ్యాంక్ దక్షిణ భారత హెడ్ శోభాశెట్టి, ప్రతినిధులు సీతారామచంద్ర, వినయ్ కుమార్, బాలకృష్ణలు మంత్రితో సమావేశం అయ్యారు. గ్రామీణాభివృద్ధికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని జూపల్లి తెలిపారు. దేశంలోనే తెలంగాణ గ్రామాలను ఆదర్శంగా నిలిచేలా కార్యక్రమాలు చేపడుతున్నట్టు మంత్రి జూపల్లి ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు తెలిపారు. ప్రపంచ బ్యాంకు నిధులతో తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమాలన్నీ సమర్థంగా నిర్వహిస్తున్నారని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాల విభజనతో పాటు గ్రామీణాభివృద్ధి శాఖలను అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తేవడం వల్ల పనుల్లో మరింత వేగం పెరుగుతోందని శోభాశెట్టి తెలిపారు.