కృష్ణ

మొవ్వలో జాగీర్‌దార్ రేసుగుర్రం స్వారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, నవంబర్ 4: కనుమరుగవుతున్న గర్రపు స్వారీ తిరిగి మొవ్వ మండలంలో ప్రారంభమైంది. మొవ్వ శివారు మూలపాలెంకు చెందిన మండవ యోగేశ్వరరావు, కుమారుడు కరుణాకర్‌లు ఆస్ట్రేలియాకు చెందిన సంకరజాతి ఇంగ్లీష్ హార్స్‌గా పిలవబడే జాగీర్‌దార్ రేసుగుర్రం గ్రామంలో స్వారీ చేస్తుండటంతో అన్ని వర్గాల ప్రజలు వింతగా చూస్తున్నారు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసే ఈ గుర్రానికి ఉలవలు, ఓట్లు, బార్లీ, నాణ్యమైన పచ్చిమేత వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఊబకాయం కలిగిన చిన్నారులు గుర్రపు స్వారీ బరువు తగ్గిస్తుందన్నారు. గుర్రం స్వారీ ద్వారా ఆలోచన శక్తి, పోటీతత్వం, ఉత్సాహం అధికమవుతాయని యోగేశ్వరరావు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ముదినేపల్లి, నవంబర్ 4: ద్విచక్రవాహనంపై వేగంగా వస్తున్న యువకుడు కత్తిపూడి జాతీయ రహదారి మలుపు తిప్పబోయి వాహనం అదుపుతప్పి ఇసుక కాలువ గట్టు వైపు ఉన్న డివైడర్‌ను డీకొంది. ఈ సంఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శుక్రవారం సింగరాయపాలెం వద్ద జరిగింది. పోలీసుల కథనం ప్రకారం కృత్తివెన్ను మండలం చిన పాండ్రాక గ్రామానికి చెందిన గోడపాటి ఏసు (38) కోరుకొల్లు వైపు నుండి బైక్‌పై వేగంగా వస్తూ ముదినేపల్లి మండలం సింగరాయపాలెం వద్ద గ్లోబెల్ ఫ్యాక్టరీకి సమీపంలో కత్తిపూడి జాతీయ రహదారి మలుపుతిప్పబోతుండగా బైక్ అదుపుతప్పి ఇసుకు కాలువపై ఉన్న డివైడర్‌ను ఢీకొని ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు లస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కె.ఏసుబాబు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ప్రభుత్వాసుపత్రికి పంపి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా తమ కుటుంబ యజమాని మృతి చెందడంతో ఆదుకునే వారు లేరంటూ దిక్కులు పిక్కటిల్లేలా భార్య, మృతుని పిల్లలు ఇద్దరు విలపించడం చూపరుల హృదయాలను కలచివేసింది.