తెలంగాణ

మిగతా శాఖలకు నిధులు తగ్గిస్తారేమో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: నీటి పారుదల రంగానికి వేలాది కోట్ల రూపాయలు కేటాయించడం వల్ల మిగతా శాఖలకు బడ్జెట్‌లో నిధులు తగ్గిస్తారేమోనన్న అనుమానాన్ని సిఎల్‌పి నేత, ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి వ్యక్తం చేశారు. బుధవారం జానారెడ్డి తనను కలిసిన విలేఖరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ భవిష్యత్తులో తన మాట నిజమైందని మీరే అంటారని విలేఖరులనుద్ధేశించి అన్నారు. కాంగ్రెస్‌కు కంచుకోట అయిన నల్లగొండ జిల్లాలో మంత్రి టి. హరీశ్‌రావు లో-లెవల్ కెనాల్ నుంచి నీరు విడుదల చేయడానికి వెళ్ళడం గురించి ప్రశ్నించగా, తమ కంచుకోటను ఎవరూ బద్దలు కొట్టలేరన్నారు. ‘ఆయన కంచుకోటలో 20 ఏళ్ళు ఏమైనా ఉంటారా?’ అని జానారెడ్డి పరోక్షంగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి తెలిపారు. ఎవరూ శాశ్వతం కాదని అన్నారు. మంత్రి హరీశ్‌రావు నీటిని విడుదల చేసేందుకు వెళ్ళిన కెనాల్ పనులను తాము అధికారంలో ఉన్నప్పుడే 90 శాతం పనులు పూర్తి చేశామని, టిఆర్‌ఎస్ అధికారం చేపట్టిన ఈ రెండున్నర ఏళ్ళలో చేసింది కేవలం 10 శాతమేనని ఆయన తెలిపారు. తామేదో ఈర్ష్య పడుతున్నట్లు మంత్రి హరీశ్ వ్యాఖ్యానించడంపై జానారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరైనా ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తారని, మంచి చేస్తే మంచి అంటామని, లేకపోతే విమర్శిస్తామని ఆయన తెలిపారు. ప్రాణహిత ఎత్తు విషయంలో తాము అధికారంలో ఉన్నప్పుడు చేసిన ప్రతిపాదనకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదని చెప్పానే తప్ప ఒప్పందం చేసుకున్నట్లు అనలేదని జానారెడ్డి పునరుద్ఘాటించారు.