రాశిఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిథి: 
బహుళ చతుర్దశి మ.2.18
నక్షత్రం: 
విశాఖ రా.8.52
వర్జ్యం: 
రా.1.18 నుండి 3.04 వరకు
దుర్ముహూర్తం: 
మ.12.24 నుండి 01.12 వరకు, తిరిగి మ.02.48 నుండి 03.36 వరకు
రాహు కాలం: 
ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం: 
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) పిల్లలవల్ల ఇబ్బందులనెదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది.
వృషభం: 
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం వుంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. అనారోగ్య బాధలధిగమించుటకు ఔషధసేవ తప్పదు.
మిథునం: 
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఋణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యముంటుంది. శతృబాధలు దూరమవుతాయి.
కర్కాటకం: 
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశే్లష) బంధు, మిత్రులతో జాగ్రత్తగా నుండుట మంచిది. చేసే పనులలో ఇబ్బందులుండును. క్రొత్త పనులను ప్రారంభించుట మంచిదికాదు. గృహంలో జరిగే మార్పులవల్ల ఆందోళన చెందుదురు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
సింహం: 
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభమేర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు.
కన్య: 
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగముంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధు, మిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు. రాజకీయ రంగాల్లోవారు ఉత్సాహంగా ఉంటారు.
తుల: 
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) ఋణప్రయత్నాలు ఫలిస్తాయి. స్థానచలన సూచనలుంటాయి. శుభకార్యాల మూలకంగా ధనవ్యయం అధికమవుతుంది. అనారోగ్యమేర్పడకుండా జాగ్రత్తపడుట అవసరం.
వృశ్చికం: 
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కుటుంబ విషయాలపై అనాసక్తితో వుంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలున్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరతాయి.స్ర్తిలతో జాగ్రత్తగా నుండుట మంచిది.
ధనుస్సు: 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.,) క్రొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసికానందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో వ్యయ, ప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంది. వృత్తిరీత్యా క్రొత్త సమస్యల నెదుర్కొంటారు.
మకరం: 
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గూర్చి జాగ్రత్త వహించాలి. భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులెదురవుతాయి.
కుంభం: 
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) విదేశయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంటుంది. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది.
మీనం: 
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు. ప్రయత్న కార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా నుండుట మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది.
Date: 
Monday, November 28, 2016
author: 
గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి