తెలంగాణ

జెఎన్‌టియులో ర్యాగింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 30: ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫస్టియర్ ఫస్ట్ సెమిస్టర్ అపుడే పూర్తి కావస్తున్నా ర్యాగింగ్ కు ఫుల్‌స్టాప్ పడలేదు. మూడు నెలలుగా కొనసాగుతున్న ర్యాగింగ్ రోజురోజుకూ జడలువిప్పుకుంటోంది. యూనివర్శిటీ కాలేజీల్లో సైతం ర్యాగింగ్‌కు జూనియర్లు బెంబేలెత్తిపోతున్నారు. కూకట్‌పల్లి జెఎన్‌టియులో గత మూడు నెలలుగా గుట్టుచప్పుడుకాకుండా సాగుతున్న ర్యాగింగ్ భూతం మరోమారు పంజా విప్పింది. జెఎన్‌టియుహెచ్‌లో సీనియర్లు ఒక జూనియర్ విద్యార్థిపై దారుణంగా ప్రవర్తించారని తెలిసింది. సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో రాఘవేంద్ర అనే బిటెక్ విద్యార్థిని తీవ్రంగా వేధించారని, గత అర్ధరాత్రి సీనియర్ విద్యార్థులు రెచ్చిపోయి రాఘవేంద్రను అర్ధనగ్నంగా క్యాంపస్‌లో పరుగులు పెట్టించారని తెలిసింది. దీంతో విషయం తెలుసుకున్న జూనియర్లు సీనియర్ విద్యార్థుల ప్రవర్తన తీరుకు నిరసనగా క్యాంపస్‌లో ఆందోళనకు దిగారు. దీంతో క్యాంపస్‌లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సీనియర్ల ఆగడాలను అదుపు చేయాలని విద్యార్థులు నినదించారు. అయితే అలాంటిదేమీ లేదని యూనివర్శిటీ అధికారులు కొట్టిపారేయడం విడ్డూరం. యూనివర్శిటీలోని సిసిటీవీ ఫుటేజ్ తీసి అందుకు బాధ్యులైన విద్యార్థులను కఠినంగా శిక్షించాలని వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.