రాశిఫలం 12-12-2016

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిథి: 
శుద్ధ త్రయోదశి ఉ.10.30
నక్షత్రం: 
కృత్తిక రా.11.40
వర్జ్యం: 
మ.12.30 నుండి 1.59 వరకు
దుర్ముహూర్తం: 
మ.12.24 నుండి 01.12 వరకు, తిరిగి మ.02.48 నుండి 03.36 వరకు
రాహు కాలం: 
ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం: 
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుండును. ఆరోగ్యం గూర్చి శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా నుండుట మంచిది.
వృషభం: 
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) వృత్తి, ఉద్యోగ రంగాల్లో కోరుకున్న అభివృద్ధి వుంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు.
మిథునం: 
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా నుండుట మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయమేర్పడుతుంది. ప్రయాణాలవల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి.
కర్కాటకం: 
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశే్లష) నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభముంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగియుంటారు
సింహం: 
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) విదేశయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా లాభమేర్పడే అవకాశముంటుంది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టాన్ని అధిగమిస్తారు. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా వుంటాయి.
కన్య: 
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) పిల్లలపట్ల ఎక్కువ పట్టుదలతో నుండుట అంత మంచిది కాదు. చెడు పనులకు దూరంగా నుండుట మంచిది. మనోద్వేగానికి గురి అవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. క్రొత్త పనులు ప్రారంభించరాదు.
తుల: 
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. వృధా ప్రయాణాలవల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా వుండుట మంచిది. అందరితో స్నేహంగా నుండుటకు ప్రయత్నించాలి.
వృశ్చికం: 
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్ర్తిల మూలకంగా లాభం వుంది. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. ఋణబాధలు తొలగును.
ధనుస్సు: 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.,) కళాకారులకు, మీడియా రంగాలవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తాను. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులను కలుస్తారు. పేరు, ప్రతిష్ఠలు సంపాదిస్తారు.
మకరం: 
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ, సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికందుతుంది.
కుంభం: 
(్ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) స్ర్తిలు మనోల్లాసాన్ని పొందుతారు. మనోధైర్యంతో సమస్యలను ఎదుర్కొంటారు. నూతన కార్యాలకు ఆటంకాలేర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణవల్ల ఇబ్బందులనెదుర్కొంటారు.
మీనం: 
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఆకస్మిక ధననష్టమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనారోగ్య బాధలు తొలగుటకు డబ్బు ఎక్కువ ఖర్చు చేస్తారు. తీర్థయాత్రకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం ఉంటుంది.
Date: 
Monday, December 12, 2016
author: 
- గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి