కృష్ణ

335 మద్యం దుకాణాలకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* నోటిఫికేషన్ జారీచేసిన ఎక్సైజ్‌శాఖ ఇన్‌చార్జి డిసి బాబ్జీరావు
విజయవాడ, జూన్ 23: జూలై 1వ తేదీ నుంచి నూతన ఎక్సైజ్ విధానం అమల్లోకి రానుండటంతో కృష్ణాజిల్లాలోని 335 మద్యం దుకాణాల కేటాయింపుకై రెండేళ్ల కాలపరిమితిపై బుధవారం నుంచి దరఖాస్తుల స్వీకరణకు సంబంధించి ఎక్సైజ్ ప్రొహిబిషన్‌శాఖ ఇన్‌చార్జి డెప్యూటీ కమిషనర్ బాబ్జీరావు మంగళవారం సాయంత్రం నోటిఫికేషన్ జారీచేసారు. దీని ప్రకారం బుధవారం నుంచి 27 తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. బినామీదారులు, నేరస్తులు, పన్ను ఎగవేతదారులకు స్థానం లేకుండా చూసేందుకై ప్రతి దరఖాస్తుదారుడు ఆధార్‌కార్డును, ఐటి రిటర్న్స్ వంటి సర్ట్ఫికెట్లను జతచేయాల్సి ఉంది. గతంలో తెల్ల రేషన్‌కార్డుదారులు మద్యం దుకాణాలను తమ పరం చేసుకోటం కలకలం రేపింది. అందుకే ఈ దఫా ప్రతి దరఖాస్తును సునిశితంగా పరిశీలించబోతున్నారు. 29న మచిలీపట్నంలో కలెక్టర్ లాటరీ విధానం ద్వారా దుకాణాలను కేటాయిస్తారు. 30న ప్రొవిజినల్ లైసెన్స్‌లను అందజేస్తారు. దరఖాస్త్ఫురంతోపాటు ఫీజుగా గ్రామాల్లో 30వేలు, మున్సిపాల్టీల్లో 40వేలు, కార్పొరేషన్‌లో 50వేలు చెల్లించాల్సి ఉంది. దరఖాస్తుల ఫీజుల రూపేణా దాదాపు రూ. 10 కోట్ల రూపాయల ఆదాయం లభించనుంది. ఇక లైసెన్స్‌ల ద్వారా గత ఆర్ధిక సంవత్సరంలో 11వేల 900 కోట్ల రూపాయల రాబడి రాగా ఈ ఏడాది 20 శాతం అధికంగా రాగలదని అంచనా వేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన ఏడు కేటగిరీలలో లైసెన్స్ ఫీజును ఖరారు చేయటం జరిగింది. ఈ దఫా మండలానికో మద్యం దుకాణాన్ని ప్రభుత్వం నేరుగా నిర్వహించనుంది. ఎంఆర్‌పి ధరలకే మద్యం విక్రయించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకోనున్నారు. తొలుత మద్యం దుకాణాలన్నింటిని ప్రభుత్వమే నిర్వహించాలని భావించినప్పటికీ ప్రభుత్వం భయపడింది. తొలిసారిగా బిగ్‌బజార్, మోర్, హెరిటేజ్, రిలయన్స్, డిమార్ట్ వంటి ఆపింగ్‌మాల్స్, హైపర్ మార్కెట్లలో కూడా మద్యం విక్రయ కౌంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
హోల్‌సేల్ అమ్మకాలకు తావులేదు
* ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు
* ఆకస్మిక తనిఖీల్లో జెసి గంధం చంద్రుడు హెచ్చరిక
విజయవాడ, జూన్ 23: రైతుబజార్లలో జరిపే అమ్మకాలు హోల్‌సేల్‌గా జరపడానికి వీలులేదని వీటిపై ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు అధికారులను హెచ్చరించారు. స్థానిక కేదారేశ్వర పేట మీ సేవా కేంద్రాలలో మంగళవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అప్పలూరు వినియోగదారులతో జాయింట్ కలెక్టర్ మాట్లాడడం జరిగింది. వినియోగదారులకు సరసమైన ధరలకు కూరగాయలు, ఆకుకూరలు అమ్మకాలు జరిపేందుకు రైతు బజార్లలను నిర్వహిస్తున్నామన్నారు. కేదారేశ్వరరావు పేట రైతు బజార్లలో ఉదయం సాయంత్రం వేళల్లో ఈ ప్రాంత వినియోగదారులకు అన్ని రకాల కూరగాయలు అందుబాటులో ఉండేలాగ ఎస్టేటు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కంద నాగమణి అనే వృద్దురాలిని జాయింట్ కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసే రేటు కంటే రైతు బజార్లలో సరుకులు రెండింతలు తక్కువ ధరకు దొరకడం జరుగుతోందని ఆమె వివరించారు. సాయంత్రం వేళల్లో కొన్ని రకాల కూరగాయలు లభ్యమవుతున్నాయని అన్ని సరుకులు ఉండేలాగ చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు జాయింట్ కలెక్టర్ రైతు బజారు ఆవరణలో ఏర్పాటు చేసిన గిరిజన స్టోరును సందర్శించి అక్కడ అమ్మే ఉత్త్పత్తులను, వాటి ధరలను పరిశీలించారు. రైతు బజార్లలో అమ్మే కూరగాయల ధరల పట్టికను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ సరైన ధరలకు అమ్మకాలు జరుపుతున్నారో లేదో పలువురిని ప్రశ్నించడం జరిగింది. కొనుగోలు చేసే ప్రక్రియను ఆయన వ్యక్తిగతంగా పరిశీలించారు. కేదారేశ్వరపేట రైతు బజారులో 158 షాపులు ఉన్నాయని ఇక్కడ మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాల్సి ఉంటుందని అందుకు అనువైన స్థలాన్ని జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. రైతు బజారుకు మరో రహదారి కూడా ఏర్పాటుకు ఎస్టేటు అధికారులు జెసి దృష్టికి తీసుకెళ్లారు.
మీ సేవ కేంద్రం ద్వారా జరిగే లావాదేవీలను పరిశీలించిన జెసి
కేదారేశ్వరపేట మీ సేవ కేంద్రంలో అందించే సేవల వివరాలను జెసి చంద్రుడు పరిశీలించారు. మీ సేవ నిర్వాహకుడు మేనేజర్ కరీం మహమ్మద్ వివరాలను తెలుపుతూ జూన్ నెలలో 29 సేవల ద్వారా 684 మంది దరఖాస్తు సమర్పించారని ఇందుకోసం 90 వేల మేర ఫీజును వసూలు చేశామని ఆ మొత్తాన్ని సంబంధిత ఖాతాకు జమ చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ సేవ ద్వారా అడంగల్, ఆదాయ, ఎన్‌కంబరెన్స్ ధృవపత్రాలు తదితర వివరాలను తెలుసుకున్నారు. అడంగల్ జారీ సందర్భంలో ఏఏ పత్రాలను తీసుకుంటున్నారు. వాటిని ఏ విధంగా అప్‌లోడ్ చేస్తున్నారో స్వయంగా పరిశీలించారు. కరెంటు బిల్లు చెల్లింపులో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అని, ఎక్కువ తీసుకుంటున్నారా అని అప్పారావు అనే వ్యక్తిని ఆయన అడిగి తెలుసుకున్నారు. మీ సేవ కేంద్రం పరిధిలో సైకిలు స్టాండ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని రైతు బజార్లలో కొనుగోలుకు వచ్చే వ్యక్తులు మీ సేవ వద్ద సైకిళ్లను, వాహనాలను నిలపడం తగదని వెంటనే మీ సేవ వద్ద సైకిల్ స్టాండ్‌ను ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. ఈ పర్యటన సందర్భంలో అర్బన్ తహశీల్దార్ ఆర్.శివరావు, మార్కెటింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ కిశోర్ బాబు, ఎస్టేటు అధికారులు జి.రాణి, పి.ఉదయకిరణ్ మూర్తి, సూపర్‌వైజర్ ఎస్.కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.