తెలంగాణ

సీఎం ఇంటి ముందే చేజింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 25: ఎప్పుడూ రద్దీగా ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ఎదుట చేజింగ్ జరిగింది. పివిఆర్ సినిమాస్ యజమాని గోపాల్ గుప్తా కుమారుడు వంష్ గుప్తాపై కేసు నమోదైంది. శనివారం రాత్రి గం.11. దాటింది.. సిఎం క్యాంప్ కార్యాలయం ఎదుట అతివేగంగా వెళుతోన్న ఓ కారు వెంబడి సైరన్ కొడుతూ పోలీస్ వాహనం. కారు ఫ్లైఓవర్ ఎక్కిన తరువాత పోలీస్ వాహనం దాన్ని ఓవర్‌టేక్ చేసింది. అందులో పివిఆర్ సినిమాస్ యజమాని గోపాల్ గుప్తా కొడుకు వంశ్‌గుప్తా ఉన్నారు. వారాంతపు తనిఖీల్లో భాగంగా అప్పుడే పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసుకుంటుండగా, బేగంపేట వైపునుంచి ఓ కారు 100కి.మీ. వేగంతో సిఎం క్యాంపు కార్యాలయం నుంచి దూసుకెళ్తోంది. ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సంతోష్ కిరణ్ దాన్ని చూసి వెంబడించారు. సెక్షన్ 279 కింద రాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యం కింద చలానా రాసి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతివేగంపై వంశ్‌గుప్తాకును కౌనె్సలింగ్‌కు హాజరు కావాలని ఆదేశించామని ఇన్‌స్పెక్టర్ సంతోష్ కిరణ్ తెలిపారు.