క్రీడాభూమి

యువీ రాణిస్తాడా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 8: ఎడమచేతి వాటం మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్, పార్ట్‌టైమ్ స్పిన్నర్ యువరాజ్ సింగ్‌పై సెలక్టర్లు నమ్మకం ఉంచడం, ఇంగ్లాండ్‌తో జరిగే వనే్డతోపాటు టి-20 సిరీస్‌కు కూడా అతనిని ఎంపిక చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెలక్టర్ల నిర్ణయం సరైనదేనా అన్న ప్రశ్న వినిపిస్తున్నది. మరో రెండేళ్లలో జరిగే ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌ను దృష్టిలో ఉంచుకొని, ఈలోగా విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా స్థిరపడతాడన్న ఉద్దేశంతో మహేంద్ర సింగ్ ధోనీ పరిమిత ఓవర్ల ఫార్మాట్స్‌లో నాయకత్వ బాధ్యతను వదులుకోవడాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే టెస్టుల్లో టీమిండియాకు నాయకత్వం వహిస్తున్న కోహ్లీని వనే్డ, టి-20 ఫార్మాట్స్‌లోనూ భారత కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై ఎవరికీ, ఎలాంటి అభ్యంతరాలు లేవు. చివరికి 35 ఏళ్ల ధోనీని రెండు ఫార్మాట్స్‌లోనూ ఆటగాడిగా కొనసాగించడం కూడా పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. కానీ, అదే వయసున్న యువీని పరిమిత ఓవర్ల ఫార్మాట్స్‌కు ఎంపిక చేయడం మాత్రం ఎవరికీ కొరుకుడు పడడం లేదు. ఇంగ్లాండ్‌తో జరిగే వనే్డ, టి-20 సిరీస్‌ల్లో అతను రాణిస్తాడా? అన్న అనుమానం వ్యక్తమవుతున్నది. 2019 జరిగే ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ వరకూ యువీ ఫిట్నెస్‌ను కొనసాగిస్తాడా? ఫామ్‌లో ఉంటాడా? అన్న ప్రశ్నలకు సెలక్టర్ల నుంచి సమాధానం లేదు. అతనితో పోలిస్తే ధోనీ ఫిట్నెస్ ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయి. రెండేళ్ల తర్వాత జరిగే ప్రపంచ కప్‌లో ధోనీ ఆడగలడని అనుకోవచ్చు. కానీ, తరచు ఫిట్నెస్ సమస్యలతో బాధపడే యువీకి ఆ అవకాశం దాదాపు లేదు. పైగా, బ్యాటింగ్‌లో టీమిండియా పటిష్టంగా ఉంది. ఏదో ఒక స్థానంలో యువీని బరిలోకి దించాల్సినంత అవసరం లేదు. రోహిత్ శర్మ పునరాగమనం భారత బ్యాటింగ్‌ను మరింత బలోపేతం చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో యువీని అటు వనే్డ, ఇటు టి-20 ఫార్మాట్స్‌కు సెలక్టర్లు ఎందుకు ఎంపిక చేశారన్నది ప్రశ్న. కండరాలు బెణకడంతో జయంత్ యాదవ్ జట్టుకు దూరం కావడమే యువీని జట్టులోకి తీసుకోవడానికి కారణమని సెలక్షన్ కమిటీ తన నిర్ణయాన్ని సమర్థించుకోవచ్చు. కానీ, ఇశాంక్ జగ్గీ, దీపక్ హూడా, ఇషాన్ కిషన్ వంటి యువ ఆటగాళ్లు జాతీయ జట్టులో స్థానం కోసం తీవ్రంగా పోటీపడుతున్నారు. వీరంతా సమర్థులే. యువీ కంటే మెరుగైన ప్రదర్శనతో రాణించే సత్తా ఉన్నవారే. యువకులను కాదని యువీని రెండు ఫార్మాట్స్‌లోనూ ఎందుకు తీసుకున్నారని క్రికెట్ అభిమానులు వేస్తున్న సూటి ప్రశ్నకు ఎవరి వద్దా సమాధానం లేదు. ఈ రంజీ ట్రోఫీ సీజన్‌లో బాగా ఆడాడన్న ఒక్క కారణంతో అతనిని ఎంపిక చేయడం ఏమాత్రం తర్కానికి అందడం లేదు. ఇంతకీ సెలక్టర్లు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని యువీ నిలబెట్టుకుంటాడా అన్నది ప్రశ్న.

చిత్రం..ముంబయ బ్రబౌర్న్ స్టేడియంలో ఆదివారం నెట్స్‌కు హాజరైన యువరాజ్