తెలంగాణ

జర్నలిస్టుల కోసం పెన్షన్ విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, మార్చి 2: రాష్ట్రంలో జర్నలిస్టులకు పెన్షన్ విధానాన్ని అమలు చేసేలా ప్రభుత్వానికి త్వరలోనే ప్రతిపాదించబోతున్నట్లు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ స్పష్టం చేసా రు. ప్రెస్ అకాడమీ ఆధ్వర్యంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా జర్నలిస్టుల సంక్షేమం, శిక్షణ అనే అంశాలను ఏకీకృత విధానం ద్వారా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం సంగారెడ్డి ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పా టు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చనిపోయిన జర్నలిస్టులకు ప్రభు త్వం నుంచి లక్ష రూపాయల చొప్పున పరిహా రం అందించడమే కాకుండా వారి కుమార్తెల వివాహానికి మూడు లక్షల ఆర్థిక సహాయం అందించడానికి ప్రభుత్వం ముందుకురావడం శుభపరిణామమన్నారు. అదేవిధంగా జీవించి ఉన్న విలేఖరులకు కూడా పెన్షన్ ఇప్పించేందుకు ప్రెస్ అకాడమీ కృషి చేస్తుందన్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పెన్షన పథకం అమల్లో ఉందన్న విషయాన్ని సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకువెళతామన్నారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల సిఎం సానుకూలంగా ఉన్నారని, ఈ నేపథ్యంలోనే చనిపోయిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించడానికి నిధులు సమకూరుస్తున్నారని అన్నారు. అక్రిడిటేషన్ ఉన్న ప్రతి జర్నలిస్టు హెల్త్‌కార్డులను విధిగా తీసుకోవాలన్నారు. గతంలో హెల్త్‌కార్డులు ఉన్నా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇబ్బందులు తలెత్తాయని, ఇప్పుడు కార్పొరేట్ ఆసుపత్రులు సుముఖంగా ఉన్నాయని, హెల్డ్ కార్డుల ద్వారా జర్నలిస్టుల కుటుంబాలకు బహుళ ప్రయోజనాలు కలుగుతాయన్నారు.