క్రీడాభూమి

ఆస్ట్రేలియాలో రాణిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 13: ఆస్ట్రేలియా టూర్‌లో రాణిస్తానని భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా ధీమా వ్యక్తం చేశాడు. ఆసీస్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌కు 37 ఏళ్ల నెహ్రా ఎంపిక కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితం వరకూ తాను జాతీయ జట్టులో స్థానం కోసం ఎదురుచూశానని, ఆతర్వాత క్రమంగా ఆశ వదులుకున్నానని ఒక వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెహ్రా చెప్పాడు. అయితే, ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ ఉత్తమ ప్రతిభ కనబరచడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. తన శ్రమ ఫలించిందని అన్నాడు. జాతీయ జట్టుకు ఎంపికైన తర్వాత అద్భుతంగా ఆడితే, ముందుగానే ఇలాంటి అవకాశం లభించాల్సి ఉండిందని అంటారని, ఒకవేళ విఫలమైతే తుది జట్టులోకి ఎందుకు ఎంపిక చేశారంటూ విమర్శిస్తారని నెహ్రా అన్నాడు. అందుకే, ఎవరు ఏమనుకుంటున్నారనే విషయాన్ని పట్టించుకోకుండా సాధ్యమైనంత వరకూ ఫిట్నెస్‌ను కొనసాగిస్తూ, మైదానంలోకి దిగిన ప్రతిసారీ ఉత్తమంగా బౌలింగ్ చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నానని తెలిపాడు. స్వదేశంలో జరగనున్న టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో ఆడే అవకాశం లభిస్తుందనే అనుకుంటున్నానని, ఆ లక్ష్యంతోనే ఆసీస్ టూర్‌కు సిద్ధమవుతున్నానని పాకిస్తాన్‌తో జరిగిన 2011 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో ఆడిన నెహ్రా అన్నాడు. చేతి వేలి గాయం కారణంగా ఫైనల్‌లో ఆడలేకపోయిన అతనికి ఆతర్వాత సుమారు ఐదేళ్లపాటు జాతీయ జట్టులో స్థానం దక్కలేదు. ఎవరూ ఊహించని విధంగా ఆసీస్ టూర్‌కు అతను ఎంపికయ్యాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని కెరీర్‌లో 120 వనే్డల్లో 157, ఎనిమిది టి-20 ఇంటర్నేషనల్స్‌లో 13 చొప్పున వికెట్లు పడగొట్టిన నెహ్రా తెలిపాడు.