రంగారెడ్డి

ఆశ వర్కర్లకు వేతనాలు పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తూరు, మార్చి 4: ఆశ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని వేతనాలు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేయాలని సిఐటియు మండల కార్యదర్శి బి.సాయిబాబా డిమాండ్ చేశారు. శనివారం కొత్తూరు మండలం తహశీల్దార్ కార్యాలయం వద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ వర్కర్లు ఎన్నో ఏళ్ల నుండి గర్భిణి స్ర్తిలకు, బాలింతలకు అనేకరకాల సేవలు అందిస్తున్నారని వివరించారు. అంగన్‌వాడి, విఆర్‌ఏ, విఓఏ, డ్వాక్రా మహిళాలకు ఎలా వేతనాలు పెంచారో అదే తరహాలో ఆశ వర్కర్లకు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. గ్రామాలలో పర్యటించి గర్భిణిలు, బాలింతల వివరాలను సేకరించి స్థానికంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇవ్వడంతోపాటు ప్రతినెల వారికి వైద్యసేవలు అందిస్తామన్నారు. ఇలాంటి సేవలు చేస్తున్న ఆశ వర్కర్లకు పట్ల సిఎం కెసిఆర్ ఎందుకు చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం ఆశ కార్యకర్తలకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ కొత్తూరు తహశీల్దార్ నాగయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకురాలు కవిత, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
బస్సు సర్వీసులు పెంచాలి
ఇంటర్మీడియట్ పరీక్షల సమయాన్ని దృష్టిలో పెట్టుకొని షాద్‌నగర్ ఆర్టీసి అధికారులు బస్సు సర్వీసుల సంఖ్యను పెంచాలని కొత్తూరు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కర్రోళ్ల సురేందర్ డిమాండ్ చేశారు. శనివారం షాద్‌నగర్ ఆర్టీసి డిపోమేనేజర్ సత్తయ్యకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షల దృష్ట్యా షాద్‌నగర్ నుండి హైదారాబాద్‌కు ఆర్టీసి బస్సుల సంఖ్యలో పెంచడంతోపాటు సమయపాలన పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇంటర్మీడియట్ పరీక్ష సమయంలో నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం లేదని, అందువల్ల ఆర్టీసి అధికారులు స్పందించి బస్సు సర్వీసుల సంఖ్య పెంచాలని అన్నారు.
ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ప్రతి 15నిమిషాలకు ఒక బస్సును నడిపించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే వివిధ గ్రామాల నుండి షాద్‌నగర్ పరీక్ష కేంద్రానికి వచ్చే విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసి బస్సులు అదనంగా నడిపించే విధంగా కృషి చేయాలని అన్నారు.
ఈ సంధర్భంగా డిఎం సత్తయ్య స్పందిస్తూ విద్యార్థుల పరీక్ష సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసి బస్సులను నడిపించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ షాద్‌నగర్ నియోజకవర్గ అధ్యక్షుడు మధు, యువజన కాంగ్రెస్ పార్లమెంట్ కార్యదర్శి ఖదీర్, పట్టణ అధ్యక్షుడు అందె మోహన్, పలుగుడెం శ్రీశైలం, భ్యాగరి సుమన్, లడ్డూ యాదవ్, హరీఫ్, ఎం.రాజు, కృష్ణ పాల్గొన్నారు.