తెలంగాణ

నత్తనడకన ప్రాజెక్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 6: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన వివిధ సాగునీటి ప్రాజెక్టుల డిజైనింగ్, రీడిజైనింగ్‌లో కాంట్రాక్టర్ల పాత్రపై న్యాయవిచారణ జరిపించాలని తెలంగాణ జెఏసి చైర్మన్ కోదండరామ్ డిమాండ్ చేశారు. అనేక ఆరోపణలు వస్తున్న మిషన్ కాకతీయ పనులపైనా సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. సోమవారం నాడిక్కడ సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్‌లో జరిగిన ‘గోదావరి, కృష్ణా జలాల వినియోగం, ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పై పున:పరిశీలన’ అనే అంశంపై జరిగిన వామపక్షాలు, ప్రజా సంఘాల రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశంలో కోదండరామ్ మాట్లాడారు. గోదావరిపై చేపట్టిన ప్రాజెక్టుల వల్ల వరంగల్, రంగారెడ్డి, సూర్యాపేట వంటి కొన్ని ప్రాంతాలకు నీళ్లు రావని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం సాగిన ఉద్యమం వల్ల కొన్ని ప్రాజెక్టులు వచ్చినప్పటికీ అవి నత్తనడకన నడుస్తున్నాయని అన్నారు. ప్రాజెక్టుల అంచనాలు, డిజైనింగ్, రీడిజైనింగ్ అన్నీ ప్రభుత్వ శాఖలే చేపట్టలని ఆయన సూచించారు. వామపక్ష, ప్రజాసంఘాలు చేపట్టే ఉద్యమంలో ఏ రూపంలో పాలుపంచుకునేది స్టీరింగ్ కమిటీలో చర్చిం చి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పలువురు వామపక్ష, ప్రజా సంఘాల నేతలు మాట్లాడుతూ రీ డిజైనింగ్ పేరిట వేల కోట్లను వృధా చేస్తూ ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల పెద్ద కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి, తెలంగాణకు చెందిన చిన్న కాంట్రాక్టర్లను బిచ్చగాళ్లగా మారుస్తోందని ప్రభుత్వాన్ని విమర్శించా రు. ఈ సమావేశానికి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అధ్యక్షత వహించారు. సాగునీటి ప్రాజెక్టుల్లో రీ డిజైనింగ్ పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం కాకుండా చేపట్టే ఉద్యమ నిర్మాణంలో భాగంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం చేపట్టినట్లు తెలిపారు. సమావేశం లో నిర్ణయించిన తీర్మానాలను ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రి, అధికారులకు అందజేస్తామని అన్నారు. జిల్లా స్థాయి సదస్సులు, గ్రామసభల ఏర్పాటు తదితర అంశాలను రౌండ్ టేబు ల్ సమావేశంలో చర్చించి నిర్ణయించనున్నట్లు చంద్రకుమార్ వెల్లడించారు. సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడి మూడేళ్లయినా నేటికీ నది జలాలలను సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నామన్నారు. ఇందు కు ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. గత ఇపిసి విధానాన్ని కొనసాగిస్తూ తెలంగాణ కాంట్రాక్టర్లు జిహుజూర్ అనే విధంగా కాంట్రాక్టర్లకే పనులు అప్పజెబుతూ వేల కోట్ల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని విమర్శించారు.