తెలంగాణ

చర్చలకు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారంతో ముగియనున్నాయి. దాదాపు రెండు దశాబ్దాల(1996) తరువాత అన్ని పద్దులపై కూడా చర్చ జరగటం నిస్సందేహంగా ఓ రికార్డు.
బడ్జెట్ సమావేశాలు ఆద్యంతం వివిధ అంశాలపై అర్ధవంతమైన చర్చ సాగింది. తెలంగాణ శాసన సభలో ప్రతిపక్ష నాయకుడికి అన్ని విధాలైన గౌరవం ఇస్తున్నామని, విపక్ష నాయకుడికి ఎన్ని సార్లయినా మైకు ఇవ్వడమే కాదు, మాట్లాడుతున్న మంత్రులు కూడా కూర్చొని విపక్ష నాయకునికి అవకాశం ఇస్తున్నట్టు శాసనసభా వ్యవహారాల మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు.
మొత్తం బడ్జెట్ సమావేశాల్లో టిడిపి సభ్యులు లేక పోవడం ఓ లోపం. పార్టీతో తనకు సంబంధం లేదంటూ గతంలో ప్రకటించిన ఆర్.కృష్ణయ్య ఒక్కరే సభలో ఉన్నారు. రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలను సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేశారు. తొలి రోజు గవర్నర్ ప్రసంగిస్తున్నప్పుడు నినాదాలు చేస్తూ ప్రసం గ ప్రతులను చింపుతూ నిబంధనలను విరుద్ధంగా వ్యవహరించారని టిడిపి సభ్యులను ఈ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేశారు. టిడిపి సభ్యులకు మద్దతుగా మొదటి రోజు కాంగ్రెస్, బిజెపి సభ్యులు వాకౌట్ చేశారు. ఆ తరువాత ఆ రెండు పార్టీలు యథావిధిగా సమావేశాల్లో పాల్గొన్నాయి. సస్పెన్షన్ ఎత్తివేయాలని విపక్షాలు ప్రభుత్వానికి సూచించాయి. అధికార పక్షం ఆ దిశగా ఆలోచిస్తున్న సమయంలోనే తమ సస్పెష్షన్ రాజ్యాంగ విరుద్ధమంటూ టిడిపి కోర్టుకు వెళ్లడంతో అధికార పక్షం నిర్ణయం మార్చుకుంది. కోర్టుకు వెళ్లారు కదా? ఏం నిర్ణయం వస్తుందో చూద్దాం అని సస్పెన్షన్‌ను వెనక్కి తీసుకునే నిర్ణయాన్ని మార్చుకున్నారు. దీంతో బడ్జెట్ సమావేశాల్లో టిడిపి అభిప్రాయం వినిపించకుండా పోయింది. ఆర్ కృష్ణయ్య అసెంబ్లీ రికార్డుల ప్రకారం టిడిపి అయినా, బిసి సంక్షేమ సంఘం నాయకుడిగానే ఉంటున్నారు. సాధారణంగా బడ్జెట్ సమావేశాల్లో అధికార పక్షంపై విపక్షాలు విరుచుకు పడతాయి. కానీ ఈ బడ్జెట్ సమావేశాల్లో విపక్షాలు కకావికలయ్యాయి. కాంగ్రెస్‌లో గ్రూపుల గొడవలు బహిరంగ మయ్యాయి. ఎమ్మెల్యేలు ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉన్నారు. ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ను బుజ్జగించడం కాంగ్రెస్‌కు సమస్యాత్మకమైంది. బడ్జెట్ సమావేశాల్లో అనేక సార్లు సంపత్‌కుమార్‌ను కాంగ్రెస్ నేతలు బుజ్జగించారు. కాంగ్రెస్ నేతల వైఖరిపై బహిరంగంగానే సంపత్‌కుమార్ విమర్శలు చేశారు.
అదే సమయంలో అధికార పక్షం మాత్రం ఒకవైపు విపక్షానికి తగిన గౌరవం ఇస్తూనే అన్ని అంశాలపై చర్చకు అవకాశం కల్పిస్తూ సుహృద్భావ వాతావరణంలో శాసన సభ సమావేశాలు జరిగేట్టు చేశారు.