S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/28/2017 - 00:56

ఇస్టాంబుల్: మాదక ద్రవ్యాలను ఉపయోగించి, క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన షరపోవాను జీవితకాలం నిషేధించాలని కెనడా టెన్నిస్ స్టార్ యూగెనీ బుచార్డ్ డిమాండ్ చేసింది. మెల్డోనియం అనే నిషిద్ధ ఉత్ప్రేరకాన్ని వాడినట్టు షరపోవా స్వయంగా అంగీకరించిన విషయాన్ని ఆమె గుర్తుచేస్తూ, ఇలాంటి చీటర్లకు మళ్లీ టెన్నిస్ ఆడే అవకాశం ఇవ్వకూడదని వ్యాఖ్యానించింది.

04/28/2017 - 00:55

ఉహాన్ (చైనా), ఏప్రిల్ 27: ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ మహిళల సింగిల్స్‌లో భారత స్టార్, తెలుగు తేజం పివి సింధు క్వార్టర్ ఫైనల్స్ చేరింది. రెండో రౌండ్‌లో ఆమె జపాన్‌కు చెందిన అన్‌సీడెడ్ క్రీడాకారిణి అయా ఒహొరీని 21-14, 21-15 తేడాతో సులభంగా ఓడించి, టైటిల్ దిశగా ముందడుగు వేసింది. క్వార్టర్స్‌లో ఆమె చైనాకు చెందిన హి బింజియావోను ఢీ కొంటుంది.

04/27/2017 - 07:46

పుణే, ఏప్రిల్ 26: మహారాష్ట్ర క్రికెట్ సంఘం (ఎంసిఎ) మైదానంలో బుధవారం జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి-20 క్రికెట్ టోర్నమెంట్ గ్రూప్ మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాబిన్ ఉతప్ప బాధ్యతాయుతమైన ఆట నైట్ రైడర్స్ విజయంలో కీలక పాత్ర పోషించింది.

04/27/2017 - 05:47

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: తన డిమాండ్లను సాధించుకోవడానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి)పై ఒత్తిడిని పెంచాలనుకున్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) పాచిక పారలేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో బిసిసిఐ ఏకాకిగా మిగిలింది. చైర్మన్ శశాంక్ మనోహర్ సూచించిన ప్రతిపాదనలకు ఐసిసి ఆమోదం లభించింది. తన డిమాండ్లను సాధించుకోవడానికి బిసిసిఐ చాలా ప్రయత్నాలే చేసింది.

04/27/2017 - 05:47

యునైటెడ్ కింగ్‌డమ్ (యుకె)లో ఈ ఏడాది జూన్ ఒకటి నుంచి 18వ తేదీ వరకు జరిగే ప్రతిష్ఠాత్మక టోర్నీ చాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించాల్సిన తుది గడువు ముగిసినా బిసిసిఐ స్పందించలేదు. ఎనిమిది దేశాలు పోటీలో ఉండే ఈ టోర్నీకి ఏడు దేశాలు ఇప్పటికే జాబితాను ఐసిసికి పంపాయి. భారత్ మాత్రం ఉద్దేశపూర్వకంగానే జట్టు వివరాలను పంపలేదని సమాచారం.

04/27/2017 - 05:46

వాంకోవర్, ఏప్రిల్ 26: ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో బిడ్డ పుట్టిన తర్వాత తిరిగి కెరీర్‌ను కొనసాగిస్తానని ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ స్పష్టం చేసింది. ప్రముఖ జరలిస్టు గేల్ కింగ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఆస్ట్రేలియా ఓపెన్ ప్రారంభానికి కేవలం రెండు రోజుల ముందే తనకు గర్భవతినన్న విషయం తెలిసిందని చెప్పింది. ఆ టోర్నీలో సక్రమంగా ఆడగలనా? లేదా?

04/27/2017 - 05:45

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఒసి) కమిటీలో చోటు దక్కించుకున్న తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించిన రిలయెన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు నీతా అంబానీకి తాజాగా రెండు కీలక పదవులు లభించాయి. ఆమెను ఒలింపిక్ చానెల్, విద్యా కమిటీల్లో సభ్యురాలిగా తీసుకున్నట్టు ఐఒసి తాజా ప్రకటనలో తెలిపింది.

04/27/2017 - 05:45

డి సౌజా బెయిల్‌ను రద్దు చేసిన కోర్టు

04/27/2017 - 05:44

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ లయన్స్
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో గురువారం రాత్రి 8 గంటలకు మొదలు

Pages