S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

10/09/2016 - 01:11

ఇండోర్, అక్టోబర్ 8: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని టాస్‌ల హీరోగా చెప్పుకోవాలి. స్వదేశంలో గత ఏడు టెస్టుల్లో అతను ఒక్కసారి కూడా టాస్‌ను కోల్పోలేదు. దక్షిణాఫ్రికాతో మొదలైన అతని టాస్ విజయాల ప్రయాణం ఇంకా కొనసాగుతునే ఉంది.

10/09/2016 - 01:08

కరాచీ, అక్టోబర్ 8: స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి, నేరం రుజువుకావడంతో జైలు శిక్షను అనుభవించి, ఆపై సస్పెన్షన్ వేటును కూడా ఎదుర్కొన్న పాకిస్తాన్ క్రికెటర్లు సల్మాన్ బట్, మహమ్మద్ ఆసిఫ్ మళ్లీ జాతీయ జట్టులోకి అడుగుపెట్టే దిశగా తొలి అడుగు వేశారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పిఎస్‌ఎల్)లో వీరిద్దరికీ స్థానం లభించింది.

10/09/2016 - 01:03

పారిస్, అక్టోబర్ 8: సూపర్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో కెరీర్‌లో 42వ హ్యాట్రిక్ నమోదు చేసిన నేపథ్యంలో, ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ టోర్నీమెంట్‌లో భాగంగా ఆండోరాతో తలపడిన పోర్చుగల్ 6-0 తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ మొదటి నాలుగు నిమిషాల్లోనే రొనాల్డో రెండు గోల్స్ చేసి, ప్రత్యర్థులకు ముచ్చెమటలు పోయించాడు. ఆతర్వాత కూడా అతని విజృంభణ కొనసాగింది.

10/09/2016 - 01:02

వ్లాడివొస్టక్ (రష్యా), అక్టోబర్ 8: ఇక్కడ జరుగుతున్న రష్యా ఓపెన్ గ్రాండ్ ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో భారత క్రీడాకారిణి రుత్విక శివానీ గద్దె ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీ ఫైనల్స్‌లో ఆమె స్థానిక క్రీడాకారిణి, రెండో సీడ్ సెనినా పొలికర్వొవాను 22-20, 21-13 తేడాతో ఓడించింది. 18 ఏళ్ల రుత్విక టైటిల్ కోసం యెవ్‌గెనియా కొసెస్కయాతో తలపడుతుంది.

10/09/2016 - 01:00

అహ్మదాబాద్, అక్టోబర్ 8: ప్రపంచ కప్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో భాగంగా శనివారం ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్‌ని భారత్ 34 పాయంట్ల తేడాతో గెల్చుకుంది. ఆసీస్‌పై పూర్తి ఆధిపత్యం కనబరచిన భారత్ 54 పాయంట్లు సంపాదించగా, ఆస్ట్రేలియా 20 పాయంట్లు మాత్రమే చేయగలిగింది. అయతే, ప్రపంచ కప్ టోర్నీలో కొత్తగా అడుగుపెట్టిన ఈ జట్టు తన మొదటి మ్యాచ్‌లోనే రెండు పదుల పా యంట్లు సంపాదించడం విశేషమే.

10/09/2016 - 00:59

సిడ్నీ, అక్టోబర్ 8: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ జాన్ గ్లీసన్ (78) కన్నుమూశాడు. 1967 నుంచి 1972 వరకూ కొనసాగిన ఇంటర్నేషనల్ కెరీర్‌లో అతను మొత్తం 29 టెస్టులు ఆడాడు. 93 వికెట్లు పడగొట్టాడు. 1966-67 సీజన్‌లో న్యూ సౌత్‌వేల్స్ తరఫున దేశవాళీ మ్యాచ్‌లో కేవలం ఐదు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టి సంచలనం రేపాడు.

10/08/2016 - 02:05

ఇండోర్, అక్టోబర్ 7: ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకోవడంతో పాటు టెస్టుల్లో నంబర్ వన్ స్థానాన్ని కూడా పదిలం చేసుకున్న భారత్ సొంతగడ్డపై టెస్టు సిరీస్‌లో మరో క్లీన్‌స్వీప్ లక్ష్యంగా ఇక్కడ శనివారంనుంచి ఇక్కడ ప్రారంభం కానున్న మూడో టెస్టు బరిలోకి దిగుతోంది.

10/08/2016 - 02:02

న్యూఢిల్లీ, అక్టోబర్ 7: జస్టిస్ లోధా కమిటీ చేసిన సిఫారసులను అమలు చేసేవరకూ 12 రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బిసిసిఐ) నిధులను విడుదల చేయరాదని సుప్రీం కోర్టు శుక్రవారం నిషేధాన్ని విధించింది. లోధా కమిటీ సిఫారసుల అమలుకు తీర్మానాన్ని ఆమోదించకపోతే రాష్ట్రాల క్రికెట్ సంఘాలు నిధులను పొందలేవని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

10/08/2016 - 02:00

వ్లాదివొస్తోక్ (రష్యా), అక్టోబర్ 7: రష్యా ఓపెన్ గ్రాండ్‌ప్రీ బాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్లు రుత్విక శివానీ, సిరిల్ వర్మ సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ఈ టోర్నీలో నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన రుత్విక (18) శుక్రవారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ పోరులో రష్యాకు చెందిన ఎలెనా కొమెంద్రోవ్‌స్కజాను మట్టికరిపించింది.

10/08/2016 - 01:59

మీర్పూర్, అక్టోబర్ 7: బంగ్లాదేశ్‌తో ప్రారంభమైన మూడు వనే్డల క్రికెట్ సిరీస్‌లో ఇంగ్లాండ్ బోణీ చేసింది. మీర్పూర్‌లోని షేర్ ఎ బంగ్లా నేషనల్ స్టేడియంలో శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆ జట్టు 21 పరుగుల తేడాతో ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టును మట్టికరిపించి తొలి విజయాన్ని అందుకుంది.

Pages