Aadivavram - Meeku Telusaa?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు తెలుసా ?

Hide this category: 
Hide

అక్కడ గొర్రెలు ఎక్కువ

ప్రపంచంలో గొర్రెలు ఎక్కువగా ఉన్నది చైనాలోనే. అయితే మనుషులు, గొర్రెల నిష్పత్తి ప్రకారం అవి ఎక్కువగా ఉన్నది మూడు దేశాల్లో. న్యూజిలాండ్, మంగోలియా, ఆస్ట్రేలియా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. సగటున ఒక మనిషికి 7 నుంచి 22 గొర్రెల చొప్పున అక్కడ ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అమెరికా అవసరాల్లో ఎక్కువ భాగం ఈ దేశాలే తీరుస్తున్నాయి. సరే, మాంసం, ఆహారోత్పత్తులు, ఉన్ని వస్తువుల తయారీకి గొర్రెలను ఉపయోగిస్తారని తెలుసుకదా. కానీ టెన్నిస్ బ్యాట్‌లలో వాడే స్ట్రింగ్స్‌ను గొర్రెల పేగులతో చేస్తారని తెలుసా? వీటి పాలపై వచ్చే నురగ, వెన్నతో సబ్బులు, సౌందర్యోత్పత్తులు తయారు చేస్తారని తెలుసా?

- ఎస్.కె.కె. రవళి

చేతులపై మూత్ర విసర్జన ఎందుకు చేస్తాయి?

చిన్నగా, అందంగా ఉడతలా కనిపించే ‘స్క్విరల్ మంకీ’ తన జీవితకాలంలో 99 శాతం చెట్లపై భాగంలోనే జీవిస్తాయి. నిరంతరం ఒకచెట్టు మీంచి మరో చెట్టుమీదకు తిరుగుతూ ఉంటాయి. ఆహారానే్వషణ కోసం ఎక్కడెక్కడికో వెళతాయి. అయితే తన కుటుంబంలో మిగతా సభ్యులు తనను అనుసరించేందుకు అవి ఒక పద్ధతి పాటిస్తాయి. ఇది వింతగా అనిపిస్తుంది కానీ వాటికి అదో భద్రతా ఏర్పాటన్నమాట. కుటుంబం నుంచి విడిపోకుండా ఉండటానికి, తమవారి జాడ తెలుసుకోవడానికి అవి ఓ విభిన్నమైన అలవాటు చేసుకున్నాయి. ఈ ఉడత కోతులు చేతులు, కాళ్లపై మూత్రాన్ని విసర్జిస్తాయి. ఆ తడిచేతులు, కాళ్లతో కొమ్మలను పట్టుకుని తిరుగుతాయి.

- ఎస్.కె.కె. రవళి

మునివేళ్లపై నడుస్తాయెందుకు?

నిజమే. ఈ చిత్రంలో అచ్చం తోడేలులా కనిపిస్తున్నప్పటికీ వాటికీ దీనికీ పోలిక లేదు. ఇది కుక్క జాతికి చెందిన ‘కొయెట్’. కుక్కల తరువాత, తోడేలుకు ముందు జరిగిన పరిణామ దశకు సాక్ష్యం ఇవి. నక్కలా కుచ్చుతోక ఉంటుంది. పసుపురంగు కళ్లుంటాయి. నిటారైన గుండ్రటి చెవులతో వినికిడి శక్తి ఎక్కువ. మైలు దూరంలో ఆహారం లేదా శత్రువుల కదలికలను ఇవి పసిగట్టగలవు. ఈతలో ఇవి మేటి. గంటకు 65 కి.మి. వేగంతో పరుగుపెట్టగల సామర్థ్యం వీటికి ఉంది. ఇవి చాలా తెలివైన జంతువులు. శత్రువుకు చిక్కకుండా ఉండేందుకు అలికిడి కాకుండా నడవడానికి కేవలం మునివేళ్లపై నెమ్మదిగా నడచివెళ్లడం వీటి ప్రత్యేకత.

- ఎస్.కె.కె. రవళి

ఇది నిద్రలేస్తే వసంతం వచ్చినట్లే!

శీతాకాలం ముగిసి వసంతం వచ్చేసినట్లు తెలియాలంటే వాతావరణంలో వచ్చిన మార్పులు, పంచాంగాలపై మనం ఆధారపడతాం కదా! కానీ ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ‘గ్రౌండ్‌హగ్స్’ కదలికల ఆధారంగా వసంతం ఎప్పుడు వచ్చేదీ తెలుసుకుంటారు అక్కడి వారు. శీతాకాలంలో సుషుప్తావస్థలో గడిపేసే ఈ ఉడతజాతి జీవులు మత్తు వదిలి బొరియల్లోంచి బయటకు వచ్చి తమ నీడ పడే తీరును చూసి వసంతం మొదలయ్యే రోజును లెక్కిస్తాయట. ఒకవేళ అవి మళ్లీ బొరియలోకి వెళ్లి నిద్రలోకి జారుకుంటే ఆ సీజన్ మరికొన్ని రోజులు ఆలస్యం అవుతుందని అర్థమట. అలా కాకుండా బొరియలోంచి వచ్చి ఇక ఆహారానే్వషణ మొదలెడితే ఇక వసంతం వచ్చేసినట్లేనని అక్కడివారు సంబరపడిపోతారుట.

టేప్‌వార్మ్ పొడవుఎంతో తెలుసా!

పెంపుడు జంతువులు, ఉడకని మాంసాహారం తినడం ద్వారా ఇతర జీవుల్లోకి చేరే పరాన్నజీవి టేపేవార్మ్. అతిధేయి తినే ఆహారాన్ని తిని బతికే టేప్‌వార్మ్ (బద్దెపురుగు) చాలా సన్నగా, తెల్లగా పొడవుగా ఉంటుంది. పెద్దచిన్న పేగుల్లో ఆశ్రయించి తన పబ్బం గడుపుకునే ఇవి అతిధేయి జీవిని బట్టి పొడవు పెరుగుతుంది. మనుషుల్లో నాలుగైదు అడుగుల మేరకు పెరిగితే కొన్ని జంతువుల్లో 30 అడుగుల మేర పొడవు ఉంటుంది. ఇక వేల్ చేపల్లో అయితే వంద అడుగుల పొడవు పెరుగుతుంది.

పశువుల పండుగ ఎందుకంటే?

మనదేశంలో చాలాచోట్ల సంక్రాంతి సందర్భంగా కనుమనాడు పశువులకు పూజ చేయడం రివాజు. కానీ వియత్నాంలో ఏటా ఫిబ్రవరి మొదటి వారంలో పశువులకు రంగులద్ది పండుగ చేసుకోవడం ఆనవాయితీ. దీనికోసం హనమ్ ప్రావిన్స్‌లో జరిగే పశువుల రంగుల పండుగకు దేశం నలుమూలల నుంచి వచ్చే రైతులు పోటీల్లో పాల్గొంటారు. తాము పెంచిన పశువులకు విభిన్నమైన రంగులతో అలంకరించి పోటీలోకి దించుతారు. చైనా నూతన సంవత్సరం మొదటి నెల మొదటి వారంలో అంటే దాదాపు ఫిబ్రవరి 2న ఈ పోటీ నిర్వహిస్తారు. దేశం సుభిక్షంగా ఉండాలని, పుష్కలంగా పంటలు పండాలని, వాతావరణం అనుకూలించాలని కోరుతూ వారు ఈ వేడుకలు నిర్వహిస్తారు.

- ఎస్.కె.కె. రవళి

ఈ పక్షులను అలా ఎందుకు పిలుస్తారు?

ఉత్తర అమెరికా, కెనడాల్లో కనిపించే ఈ ‘రెడ్ కార్డినల్’ పక్షులను అలా పిలవడానికి అసలు కారణం తెలుసా. రోమన్ కాథలిక్ చర్చిలలో ‘కార్డినల్స్’ ధరించే వస్త్రాలు, టోపీ ఎర్రటి రంగులో ఉంటాయి. అలా ఎర్రటి రంగులో ఉండే ఈ పక్షులను కూడా ‘రెడ్‌కార్డినల్ బర్డ్స్’గా పిలవడం అలవాటైంది. కాంతివంతమైన ఎరుపు రంగుతో మెరిసిపోయే ఈ పక్షులు మగవి. ఆడపక్షులు ఇంత మెరుపు, ఎరుపుతో ఉండవు. మిగతా సాంగ్‌బర్డ్స్‌కు భిన్నంగా ఈ జాతి పక్షుల్లో మగ, ఆడ పక్షులు ‘పాటలు’ ఆలపించగలవు. తాము నివసించే ప్రాంతానికి ఇతర మగ పక్షులు వస్తే వాటిని తరిమికొట్టేందుకు అవి దాదాపు యుద్ధమే చేస్తాయి.

- ఎస్.కె.కె. రవళి

‘ప్రెయరీ డాగ్స్’ కుక్కలు కావు!

ఉత్తర అమెరికా, మెక్సికో, కెనడాల్లో మాత్రమే కనిపించే ‘ప్రెయరీ డాగ్స్’ నిజానికి కుక్కలు కావు. కనీసం అవి కుక్కల జాతికి చెందినవి కూడా కాదు. వాటి రూపురేఖలు కూడా కుక్కలతో పోలి ఉండవు. కేవలం పేరులో మాత్రమే ‘డాగ్’ అన్న పదం ఉంటుంది. నిజానికి ఇవి ‘ఉడత’ (గ్రౌండ్ స్క్విరల్) జాతికి చెందినవి. సమూహాలుగా జీవించే వీటి సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. ఆప్యాయంగా ఒకదానిని ఒకటి ముద్దులు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం, ప్రేమను, అభిమానాన్ని చాటుకోవడం వీటి ప్రత్యేక లక్షణం. అయితే ఇదంతా ఒక కుటుంబం అంటే ఒక కాలనీ సభ్యుల మధ్య మాత్రమే. ఇతర కుటుంబాలు, కాలనీల నుంచి వచ్చే వాటితో ఇవి దాదాపు యుద్ధమే చేస్తాయి. తరిమేస్తాయి.

- ఎస్.కె.కె. రవళి

ఈ పక్షులు ఆస్ట్రేలియాలో ఉండవ్!

సాధారణ ‘్ఫంచ్’ పక్షులు ఒక్క ఆస్ట్రేలియాలో తప్ప ప్రపంచం అంతటా కనిపిస్తాయి. అక్కడి వాతావరణ పరిస్థితులు వాటికి అనుకూలం కాదు. నాలుగు ఉపజాతులు, 40 రకాల ‘్ఫంచ్’ పక్షుల్లో కామన్ ట్రూ ఫించ్ పక్షుల సంఖ్య ఎక్కువ. ఆడపక్షులు కాస్త లేత రంగుల్లో ఉంటే మగపక్షులు ఆకర్షణీయమైన రంగుల్లో ఉంటాయి. సాధారణంగా ఎర్రటి ముఖంతో ఉండే మగపక్షులంటే ఆడపక్షులకు ఎంతో ఇష్టం. మగపక్షులు తినే ఆహారాన్ని బట్టి (కరోటినాయిడ్స్) వాటికి మోము, ఛాతీపై ఎర్రటి రంగు వస్తుంది. అవి ఎంత ఎక్కువ, ఎంత బలమైన ఆహారం తింటే వాటి రంగు అంత ఎక్కువ మెరుపుతో ఉంటుంది.

- ఎస్.కె.కె. రవళి

పిస్తా అంటే చైనీయులకు ప్రీతి

పిస్తా ఉత్పత్తిలో ఇరాన్ అగ్రస్థానంలో ఉన్నా వినియోగంలో మాత్రం చైనాయే టాప్. అక్కడి వారికి పిస్తా పప్పులంటే పిచ్చి. ఆరోగ్యం కోసం వాటిని ఎక్కువగా వినియోగిస్తారు. ఈ పిస్తా పప్పుల ఉత్పత్తిలోను, వినియోగంలోను అమెరికా రెండో స్థానంలో ఉంది. ఒక పిస్తా చెట్టు రెండేళ్లకు ఓసారి 50 కిలోల పప్పులను లేదా 50వేల పప్పుగింజలను ఇస్తుంది. మొదట

- ఎస్.కె.కె. రవళి

Pages