Aadivavram - Meeku Telusaa?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు తెలుసా ?

Hide this category: 
Hide

బాల్‌పాయింట్ పెన్ కనిపెట్టిందెవరు?

హంగేరియన్ ఎడిటర్ లాస్‌జ్లో బైరో అనే ఆయన తొలిసారిగా బాల్‌పాయింట్ పెన్‌ను కనిపెట్టారు. పత్రికలో వాడే ఇంక్ త్వరగా ఆరిపోయి, చెరగకుండా ఉండేలా చూడటం, త్వరగా రాయడానికి ఉపకరించేలా ఉండటం అన్న ప్రయోజనాల కోసం ఆయన ఈ బాల్‌పాయింట్ పెన్‌ను ఆవిష్కరించారు. బాల్‌పాయింట్ పెన్‌లో వాడేందుకు ఉపయోగపడే ఇంక్‌ను తయారు చేసేందుకు బైరో సోదరుడు గ్యోర్గి సహకరించారు. ఆయన రసాయన శాస్త్రం లో నిపుణుడు. ఆ ఇద్దరూ కలసి బాల్‌పాయింట్ పెన్‌ను సృష్టించారన్నమాట. 1930లో వారు దీనిని కనిపెట్టారు. పెటెంట్ కోస్ ఎన్నోమార్లు ప్రయత్నించి సాధించారు. 1945లో ఆ హక్కులను మార్సెల్ బిక్చ్‌కు విక్రయించారు.

- ఎస్.కె.కె. రవళి

గాడిదలు వాటిని చంపేస్తాయి!

గొర్రెలు, మేకల వంటి పశువుల రక్షణకు కుక్కల మాదిరిగా గాడిదలనూ వాడతారు. అవి సందర్భానుసారం ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడంలో దిట్ట. తెలివైన గాడిదలు నక్కలు, కుక్కలు, మరికొన్ని ప్రమాదకర జంతువులను ఈ మందల వద్దకు రానివ్వకుండా కాపాడుతుంటాయి. అవసరమైతే పళ్లతో వాటిని పట్టి చంపేస్తాయి కూడా. వెనుక కాళ్లతో తన్ని దాడి చేస్తాయి. ప్రపంచంలో గాడిదలు ఎక్కువగా ఉన్నది చైనాలో. ప్రపంచంలో మొత్తం దాదాపుగా 41 మిలియన్ల గాడిదలుంటే చైనాలో 11 మిలియన్లు ఉంటాయని అంచనా. పాతికేళ్ల తరువాత చూసినా తను తిరిగిన ప్రాంతాన్ని, తన సహచర గాడిదలను, యజమానులను గుర్తుంచుకోగలగడం వీటి ప్రత్యేకత.

ఎస్.కె.కె. రవళి

వీటిని ‘బటర్‌ఫ్లై ఫిష్’ అని ఎందుకంటారు?

హిందు, పసిఫిక్, అట్లాంటిక్ మహా సముద్ర ప్రాంతాల్లో కనిపించే ఈ అందమైన చేపలను ‘సీతాకోక చిలుక చేపలు’ (బటర్‌ఫ్లై ఫిష్) అని పిలుస్తారు. శరీరంపై గుండ్రటి నల్లని కళ్లలాంటి మచ్చలు, చారలు, అందమైన రంగులతో ఇవి దాదాపు సీతాకోక చిలుకల్లా అందంగా ఉంటాయి. అవసరాన్ని బట్టి ముందుకు చొచ్చుకు వచ్చే ముక్కు వీటికి అదనపు అందాన్ని ఇస్తుంది. పగడపు దీవుల్లో ఎక్కువగా ఇవి ఉంటాయి. జత దొరికే వరకు ఒంటరిగా జీవించే ఈ చేపలు జతకట్టాక జీవితాంతం కలిసే ఉంటాయి. గుడ్ల పొదగబడిన తరువాత పుట్టే ఈ చేపలు చాలా చిన్నవిగా ఉంటాయి. రక్షణ కోసం ఈ పిల్ల చేపలు తమ చుట్టూ రక్షణ ఫలకాన్ని నిర్మించుకుంటాయి.

లేడి బగ్’ అదృష్ట దేవత ఎలా అయింది?

ఐరోపాలో మధ్యయుగం నాటి మాట ఇది. లేడ్‌బగ్ అని పిలిచే ‘బీటిల్’ను అక్కడి రైతులు అదృష్ట దేవతగా భావిస్తారు. పంటలు చీడపీడలు, తెగుళ్లు సోకడంతో నష్టపోతున్న రైతులు తమ ఇష్ట దేవతను ప్రార్థించి పంటలను కాపాడమని కోరడం, ఆమె సృష్టించిన ఈ ‘బగ్’ను ఆమె పేరుతో ‘లేడీబగ్’గా పిలవడం మొదలైంది. దాదాపు 5వేల జాతుల ‘లేడీ బగ్’లలో ఈ ఎర్రని మేను, నల్లచారలవి ప్రసిద్ధి. పంటలను దెబ్బతీసే ఒకరకమైన దోమలలాంటి పురుగులను ఇవి పెద్దమొత్తంలో తినేసి రైతులను రక్షిస్తాయి. ఒక్కో లేడీబగ్ రోజుకు 50 పురుగులను స్వాహా

వీటి శరీరాన్ని తాకితే నిప్పురవ్వలు రావొచ్చు!

అమెరికా, నాలుగైదు ఆసియా దేశాల్లో మాత్రమే కనిపించే ఆలిగేటర్ గార్ చేపలు నిజానికి ఆలిగేటర్‌తో ఎటువంటి సంబంధం లేని జలచరాలు. ఉత్తర అమెరికాలో గార్ కుటుంబానికి చెందిన చేపల్లో ఇవే అతిపెద్దవి. దాదాపు 8 నుంచి పది అడుగుల పొడవు పెరిగే వీటి శరీరం వజ్రాల్లాంటి పొలుసులతో చాలా ధృడంగా ఉంటుంది. ఒక్కోసారి వీటి శరీరాన్ని గట్టి వస్తువులు, లోహపు ఆయుధాలతో తాకితే రాపిడికి నిప్పురవ్వలు కూడా వస్తూంటాయి. ఆలిగేటర్‌లకు ఉన్నట్లు వీటికి ముక్కు పొడవుగా, పదునైన పళ్లతో ఉండటం వల్ల ఈ గార్ కుటుబానికి చెందిన చేపలను ‘ఆలిగేటర్ గార్’ చేపలుగా పిలుస్తారు. నెమ్మదిగా కదిలే ఈ చేపలు జలచరాల్లో క్రూరంగా దాడి చేసేవిగా గుర్తింపు పొందాయి.

- ఎస్.కె.కె. రవళి

నైటింగేల్స్ అప్పుడు మాత్రం కూయవు!

మనకు కోయిలమాదిరిగా బ్రిటన్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో శ్రావ్యంగా పాడే పక్షి నైటింగేల్. ఇది చూడటానికి పిచుకమాదిరిగా ఉంటుంది. దానికన్నా కాస్తంత పెద్దవిగా ఉంటాయి. ఇంకా జతకట్టని ఒంటరి మగపక్షులు శ్రావ్యంగా పాటను ఆలపించడం పరిపాటి. దట్టంగా ఉన్న పొదల్లో ఎవరికీ కనిపించకుండా అవి పాటను ఆలపిస్తాయి. పైన ఎగురుతూ వెళ్లే ఆడపక్షులను ఆకర్షించేందుకు ఇవి అలా చేస్తాయి. కానీ జతకట్టి, గుడ్లుపెట్టిన తరువాత ఆ పక్షులు అసలు కూయవు. అలా చేస్తే శత్రువులు వాటిని కనిపెడతాయని వాటి భయం. మరీ ప్రమాదం ఎదురైతే చిన్నచిన్న శబ్దాలు మాత్రం చేసి తోటి పక్షులను అప్రమత్తం చేస్తాయంతే.

వీటికి పువ్వులు అంటే ఇష్టం

ఐరోపాలోను, ఆసియా, ఆఫ్రికాలోని కొన్ని పరిమిత ప్రాంతాలలోను కన్పించే ఎలుకజాతి జీవులు ఇవి. వీటిని ‘డొర్‌వౌస్’ అని పిలుస్తారు. ఫ్రెంచ్ భాషలో ‘డొర్‌మిర్’ అన్న పదం నుంచి దీనికి ఈ పేరు వచ్చింది. ‘నిద్రపోవడం’ అన్న అర్థంతో దీనికి ఆ పేరు వాడటం మొదలుపెట్టారు. ఎందుకంటే తన జీవితకాలంలో ఇది ఎక్కువభాగం ‘సుషుప్తావస్థ’లో గడిపేస్తుంది. ఒక్కోసారి ఆ అచేతన అవస్థలోనే ప్రాణాలు విడుస్తుందికూడా. అర అంగుళం నుంచి ఏడు అంగుళాల పరిమాణం వరకు పెరిగే వీటికి పెద్దపెద్ద నల్లకళ్లు, చిన్ని చెవులు, శరీరంకన్నా పొడవైన తోక ఉంటాయి. ఇవి చెట్లపైనే జీవిస్తాయి. పూలు, వాటిలో ఉండే తేనె వీటికి ఇష్టం.

- ఎస్.కె.కె. రవళి

వీటికి మూడోకన్ను ఉంటుంది!

అమెరికా, బ్రెజిల్, మెక్సికో, కరేబియ్ ద్వీపాల్లో మాత్రమే జీవించే ‘ఇగువన’ రకం బల్లిజాతి జీవులు చాలా పెద్దగా ఉంటాయి. ఎక్కువ కాలం చెట్లపై జీవించే ఇవి దాదాపు 20 ఏళ్లపాటు మనుగడ సాగించగలవు. వీటిలో గ్రీన్ ఇగువన రకం జీవుల్లో తలపై భాగంలో మూడో కన్ను ఉండటం విశేషం. అయితే ఈ కన్ను దృశ్యాలను వీక్షించలేదు. కేవలం వేడి, వెలుతురు, చీకటి, సూర్యకాంతిలో మార్పులను మాత్రమే ఇది గుర్తిస్తుంది. 50 అడుగుల ఎతె్తై చెట్ల కొమ్మల్లో ఉండటం వీటికి ఇష్టం. దాదాపు ఆరున్నర అడుగుల పొడవున ఇవి పెరుగుతాయి. ప్రమాదం ఎదురైనప్పుడు శత్రువును తోకతో చరచి తప్పుకుంటాయి. మరీ వేగంగా తప్పించుకోవలసిన పరిస్థితి ఎదురైతే తోకను వదిలేసి పరుగుపెడతాయి.

వెయ్యేళ్లయినా ధ్వంసంకాని ప్లాస్టిక్

మనం తయారు చేసి వాడి వదిలేసిన ప్లాస్టిక్ కవరు మట్టిలో పూర్తిగా కలసిపోవాలంటే కనీసం 500 నుండి 1000 సంవత్సరాలు పడుతుంది. అంటే ఇప్పుటివరకు మనం తయారు చేసిన ప్లాస్టిక్ వస్తువు లేదా కవర్లేవీ మొదటి దశ స్థాయిలో కూడా ధ్వంసం కాలేదన్నమాట. ప్రతి సెకనుకు ప్రపంచం మొత్తంమీద లక్షా 60వేల ప్లాస్టిక్ కవర్లను వాడుతున్నామట. ఏడాదికి మనం వాడే ప్లాస్టిక్ వస్తువులను పక్కపక్కనే అమరుస్తూ వెడితే మన భూగోళాన్ని ఏడుసార్లు చుట్టేయచ్చట. మనం తయారు చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా సముద్రాల్లోకి చేరిపోతున్నాయి. వాటివల్ల జలచరాలు అంతరించిపోతున్నాయి. ముఖ్యంగా తాబేళ్లు, నీలి తిమింగలాలకు వీటివల్ల ఎంతో ముప్పు ఏర్పడుతోంది.

మొదట్లో ఇవి పశువులే తినేవి!

ప్రస్తుత ప్రపంచంలో అత్యంత బలవర్ధక ఆహారంగా వేరుశనగ తింటున్నారు. పెరూలో పుట్టి ప్రపంచానికి పరిచయమైన ఈ పంట మొదట్లో కేవలం పశువులకు ఆహారంగా మాత్రమే వాడేవారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న వేరుశనగలో మూడింట రెండువంతులు చైనా, భారత్‌లోనే పండుతోంది. అయితే వినియోగంలో మాత్రం అమెరికన్లదే అగ్రస్థానం. అక్కడివారిలో 95 శాతం మంది వేరుశనగ వెన్న, ఆహార పదార్థాలను ఆరగిస్తారు. వేరుశనగ చీజ్, కేండీల వినియోగంలో వారే మొదటి స్థానంలో ఉన్నారు. అన్నట్లు వేరుశనగ గింజలపై ఉండే ఎర్రటి పొట్టును కాగితం పరిశ్రమలో వాడతారు తెలుసా!

ఎస్.కె.కె. రవళి

Pages