Aadivavram - Meeku Telusaa?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకు తెలుసా ?

Hide this category: 
Hide

ఇది వెక్కిరింపుకాదు..శుభాకాంక్ష

నాలుకను ఇలా బయటకు పెట్టి నవ్వితే మనదగ్గర వెక్కిరించినట్లు, లేదా చిలిపిగా అల్లరి చేస్తున్నట్లు చెప్పుకుంటాం కదా. కొన్ని దేశాల్లో ఇలా నాలికతో వెక్కిరిస్తే...ఇక వారిమధ్య స్నేహబంధం చెరిగిపోయినట్లేనని భావిస్తారు. టిబెట్‌లో మాత్రం ఇలా చేస్తే అభినందించినట్లు, శుభాకాంక్షలు చెప్పినట్లు భావిస్తారు. మంచిని కోరుతున్నట్లు చెప్పడానికి అక్కడ ఇలా నాలుకబయటపెట్టి నవ్వుతారు. ఇది టిబెట్ సంప్రదాయం. అన్నట్లు మనిషి నాలుకకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి తెలుసా. మనిషి వేలిముద్రల్లాగానే నాలుకలూ ఎవరికివారికి భిన్నంగా ఉంటాయి. రూపు, ముద్ర ఏ ఒక్కరికీ ఒక్కలా ఉండవు. నాలుకపై లాలాజలం లేకపోతే మనిషికి రుచి తెలీదు.

ఎస్.కె.కె.రవళి

టోపీ...హిస్టరీ

టోపీ... అందానికి, రక్షణకు, హోదాకు, స్టైల్‌కు సంకేతంగా చెప్పుకునేవారు. టోపీ వాడకం చాలా పురాతన సంప్రదాయం. 3000 సంవత్సరాల క్రితంనుంచే వీటిని వాడేవారు. ఇటలీ-ఆస్ట్రేలియాల మధ్య పురాతత్వ తవ్వకాల్లో దొరికిన ఓ శిల్పం (వెనస్ ఆఫ్ బ్రస్సెమ్‌పౌయ్)లో ఇద్దరు మహిళలు టోపీ పెట్టుకున్నట్లుంటారు. ఆ శిల్పం కనీసం 25వేల సంవత్సరాల క్రితందిగా భావిస్తున్నారు. అంటే అప్పటికే వీటి వాడకం ఉందని చెప్పుకోవచ్చు. గాంధీ టోపీ, జిన్నా టోపీ, కౌబాయ్, బేస్‌బాల్, క్రికెట్, ట్రెల్‌బీ, ట్రాపర్, బౌలర్, బల్‌మోడల్ ఇలా రకరకాల టోపీలు ఉన్నాయి. పోప్ ధరించే టోపీకి ప్రత్యేకమైన పేరుంది. అలాగే చెఫ్‌లు వాడేవి కొన్ని, మెజీషియన్‌లు వాడేవి వేరు.

ఎస్.కె.కె.రవళి

చదరంగా ఉండే పుచ్చకాయలు

గుండ్రంగా, సిలెండర్ మాదిరిగా కన్పించే పుచ్చకాయలు అందరికీ తెలిసినవే. కానీ చదరపు ఆకారంతో ఉండే పుచ్చకాయలున్నాయని ఎందరికి తెలుసు. అయితే సహజసిద్ధంగా అవి అలా పెరగవు. మామూలు పుచ్చకాయ పాదులకే అవి కాస్తాయి. కృత్రిమ పద్ధతిలో వాటికి ఆ రూపం వచ్చేలా చేస్తారంతే. చతురస్రంగా ఉండే గాజుపెట్టెల్లో సాధారణ పుచ్చకాయలు పెరిగేలా చూస్తారు. అంటే బలవంతంగా వాటికి ఆ రూపు వచ్చేలా చేస్తారన్నమాట. జపాన్‌లోని ఒకటిరెండు ప్రాంతాల్లో మాత్రమే వీటిని పెంచగలుగుతున్నారు. 1978లో షికొకు గ్రామంలో ఓ రైతు ఈ ప్రయోగం చేశాడు. దీంతో చతురస్రపు పుచ్చకాయలకు మహా గిరాకీ ఏర్పడింది. వీటి ఖరీదుకూడా ఎక్కువే.

ఎస్.కె.కె.రవళి

మజ్జిగ...పాలకన్నా మేలు

వేసవితాపం తీర్చడంలో మజ్జిగ పాలకన్నా శ్రేష్టం. వెన్న తక్కువగా ఉన్న పాలతో చేసిన పెరుగును పల్చగా చిలికితే తయారయ్యే మజ్జిగలో పాలలోకన్నా ఎక్కువ ప్రొటీన్లు, కాల్షియం ఉంటాయి. ఆహారాన్ని శక్తిగా మార్చడానికి కావలసిన పోషకాలు, మాంసకృత్తులు పుష్కలంగా ఇందులో ఉంటాయి. ఒక గ్లాసుడు మజ్జిగతో 100 కేలరీల శక్తి వస్తుంది. మజ్జిగ తాగడం వల్ల మూత్రనాళాలు, మూత్రాశయం, మూత్రపిండాలు శుభ్రపడతాయి. మూలశంక సమస్య ఉన్నవారికి మజ్జిగతో ఉపశమనం లభిస్తుంది.

ఎస్.కె.కె.రవళి

సబ్జాతో చలువ

శరీరంలో వేడి తగ్గడానికి, జీర్ణశక్తి పెరగడానికి, బరువు తగ్గడానికి, మలబద్దకం నివారించడానికి సబ్జాగింజలతో చేసే పానీయం ఉత్తమం. మండువేసవిలో ఈ గింజలను ఉపయోగించి పానీయాలు తీసుకుంటే శరీరానికి చలవతోపాటు ఆరోగ్యం కుదుటపడుతుంది. విభూది తులసిగా చెప్పుకునే సబ్జామొక్కల గింజలు నల్లగా ఉంటాయి. వీటిని నీటిలో లేదా పెరుగు, ఐస్‌క్రీమ్, షర్బత్‌లలో వేస్తే కొద్దిసేపటికి తెల్లటిగుజ్జుతో ఉబ్బుతాయి. అలా ఉబ్బిన తరువాత ఆ పానీయాన్ని తాగితే ఎంతో మేలు. వాటిలో ఉండే పీచుపదార్థాలవల్ల అన్నవాహికకు మేలు జరుగుతుంది. గ్యాస్ట్రిక్ సమస్య నివారించబడుతుంది. ఆకలి తగ్గి శరీరం బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

ఎస్.కె.కె.రవళి

బాదం...లాభం

ప్రమాదకరం కాని కొవ్వు పుష్కలంగా ఉండే బాదం పప్పులు ఎంత తిన్నా నష్టం లేదు. రెండేళ్లదాకా నిల్వ ఉండే ఈ పప్పులు కొలెస్టరాల్ నియంత్రణకు, హృదయానికి ఎంతో మేలు చేస్తాయి. సాధారణ పాలు పడనివారికి బాదంతో చేసే పాలు ప్రత్యామ్నాయంగా పనికొస్తాయి. ప్రస్తుతం బాదంపప్పుల ఉత్పత్తిలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. నిజానికి బాదం ‘ట్రూ నట్’ కాదు. ఇది ఒక గింజమాత్రమే. వీటిపైన ఉండే కప్పు మనకి పనికిరాదు. పచ్చిగా ఉన్నా, బాగా పండిపోయినా బాదం పప్పులు తినడానికి పనికిరావు. అన్నట్లు బాదంపిండి గోధుమపిండికి ప్రత్యామ్నాయంగా వాడతారు. మధ్యప్రాచ్యంలో పుట్టి ప్రపంచం అంతా వ్యాపించిన బాదం మనకూ సుపరిచితమే.

ఎస్.కె.కె.రవళి

కుల్ఫీ కథ...

ఐస్‌క్రీమ్‌లా కన్పించే కుల్ఫీ చాలా భిన్నమైన పదార్థం. క్రీ.శ. 16వ శతాబ్దంనుంచి ఇది అందుబాటులో ఉంది. పాలతో తయారు చేసే కుల్ఫీ పాశ్చాత్య దేశాల్లో తయారయ్యే ఐస్‌క్రీమ్‌కన్నా నెమ్మదిగా కరుగుతుంది. వేళ్లమీద లెక్కపెట్టే సంఖ్యలో మాత్రమే వివిధ రుచుల్లో ఇది లభ్యమవుతుంది. భారత దేశంలో మొఘల్ పరిపాలనా కాలంలో ఇది మనకు అలవాటైంది. రూపంలో, రంగులో ఐస్‌క్రీమ్‌లకన్నా భిన్నంగా ఉంటుంది. ఆసియాదేశాలు, మధ్యప్రాచ్యంలో వీటి వాడకం ఎక్కువ.

ఎస్.కె.కె.రవళి

బెల్లం...వదలం

భారతీయులు ఎక్కువగా ఉపయోగించే బెల్లం ఉత్పత్తి, వాడకం పాశ్ఛాత్య దేశాల్లో తక్కువే. చాలాదేశాల్లో వారికి బెల్లం తెలియదంటే నమ్మాలి. భారత్, పాక్, మయన్మార్, శ్రీలంక, మలేసియా, థాయ్‌లాండ్‌వంటి ఆసియా దేశాల్లోను బెల్లం తయారీ ఓ పరిశ్రమగా వర్థిల్లుతోంది. ఒకటీఅరా ఆఫ్రికాదేశాల్లోను, ఈమధ్య యూరప్‌లో, కొంతకాలంగా గల్ఫ్ దేశాల్లో అక్కడక్కడ బెల్లం వాడకం పెరుగుతోంది. చెరకు, తాటితో బెల్లం తయారు చేస్తారని చాలామందికి తెలుసు. కానీ కొబ్బరి, ఖర్జూరం, పామ్‌తోకూడా దీనిని తయారుచేస్తారు. ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే బెల్లంలో 75శాతం భారత్‌లోనే లభ్యమవుతుంది. ఎక్కువగా ఉపయోగించేదికూడా మనమే.

మామిడి
మారాజులం!

ఎస్.కె.కె.రవళి

ఇవి నేలమీదే ఈనతాయి..’

కామన్ హిప్పోపోటమస్‌లకు వారసులే అయినా వాటికంటే భిన్నమైన ఎన్నో ప్రత్యేక లక్షణాలున్న పిగ్మీ హిప్పోపోటమస్ (పొట్టి నీటిఏనుగుల)లు అంతర్థాన దశకు చేరుకుంటున్నాయి. సాధారణ నీటిఏనుగులుకన్నా పరిమాణం, బరువులో ఐదోవంతు మాత్రమే ఉండే ఇవి చూడటానికి ముద్దుగా, బొద్దుగా ఉంటాయి. సహారా ప్రాంతంలో సాధారణ నీటిఏనుగులుంటే పిగ్మీహిప్పోలు మాత్రం పశ్చిమ ఆఫ్రికా దేశమైన లైబీరియాలో మాత్రమే ఎక్కువగా కనిపిస్తాయి. ఆఫ్రికా దేశాలైన సియర్రాలియోన్, గినియా, ఐవరీకోస్ట్‌లో చాలా అరుదుగా ఉంటాయి. సాధారణ హిప్పోలు ఎక్కువసేపు నీళ్లలో గడుపుతాయికానీ పిగ్మీ హిప్పోలు నేలమీద, నీళ్లలోనూ అవసరాన్నిబట్టి బతికేస్తాయి.

-ఎస్.కె.కె.రవళి

రంగులు మారే ముక్కు -- మీకు తెలుసా?

‘సీ పారెట్స్’గా పిలిచే ఈ ‘పఫిన్’ పక్షులు నిజానికి చిలుకలు కావు. వీటి ముక్కువల్ల వాటికి ఆ పేరువచ్చింది. ఇవి సముద్రపక్షులు. వీటి ముక్కు సీజన్‌బట్టి రంగు మారుతూంటుంది. శీతాకాలంలో వీటి ముక్కు లేతబూడిద రంగులో ఉంటే వసంతకాలం వచ్చేసరికి ముదురు ఎరుపు లేదా కాషాయవర్ణంలోకి మారుతుంది. నిజానికి వసంతం వచ్చేసరికి అవి జతకలిసే సమయం వచ్చినట్లన్నమాట. సరైన జతను ఆకట్టుకోవడంకోసం ఇవి ఇలా ఆకర్షణీయంగా మారిపోతాయన్నమాట. వీటికి మరో ప్రత్యేకత ఉంది. వీటిముక్కుకు సన్నటి కొక్కిల్లాంటి స్పైన్స్ ఉంటాయి. ఒకేసారి పదుల సంఖ్యలో చేపలను వాటితో గుచ్చి పట్టుకోవడం వీటి అలవాటు.

-ఎస్.కె.కె.రవళి

Pages